
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం
పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు.
అనంతపురం: పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 504 సంత్సరాలు పూర్తయ్యాయి. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉంటారన్నది చరిత్రకారుల భావన. 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగింది.