
సాక్షి, అనంతపురం: అనంతపురంలో పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై కూడా టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అయితే, అంతకుముందు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని తోపుదుర్తి వర్గీయులు సవాల్ విసిరారు. ఈ క్రమంలో క్లాక్ టవర్ వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పరిటాల వర్గీయలు రాళ్లు విసిరారు. ఈ సమయంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment