
పరిటాల సునీత
అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు.
అనంతపురం: అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. రేషన్ షాపుల్లో అవినీతికి పాల్పడితే సహించేదిలేదన్నారు.
రుణాలు తీసుకున్న రైతులకు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వద్దని బ్యాంకర్లను కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. ప్రభుత్వం రుణాలు రద్దు చేస్తామని చెప్పి, ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో బ్యాంకర్లు రుణం తీసుకున్నవారికి నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.