ఆర్డీవోలు ఉన్నారా.. లేరా?
- అధికారులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు?
- డీఆర్వోపై మంత్రి పరిటాల సునీత ఆగ్రహం
మదనపల్లె: ‘ముఖ్యమంత్రి సొంత జిల్లా లో అసలు ఆర్డీవోలు ఉన్నారా.. లేరా? ఉంటే వాళ్లేమైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? సమీక్ష సమావేశానికి ఎందుకు రాలేదు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత డీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సీఎల్‌ఆర్‌సీ భవనం లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లాలోని జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల గైర్హాజరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సమావేశంలో అధికారులంతా ఉత్సాహంగా లేకపోవడంతో ‘మీరింకా కాంగ్రెస్ ప్రభుత్వ నిద్రనుంచి లేవలే దా.. త్వరగా లేవండి లేచి విధులు సక్రమంగా నిర్వర్తించండి’ అంటూ చలోక్తులు విసిరారు. అంతేకాకుండా వచ్చే సమావేశానికి అధికారులు రాకుంటే నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి మాట్లాడుతాన ని ఘాటుగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆధార్ అనుసంధానం 90 శాతం జరగడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను ప్రజలకు నేరుగా చేరవేసేలా పౌరసరఫరాల శాఖ కృషి చేయాలన్నారు. పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులం తా నిబధ్ధతతో పనిచేయాలని సూచిం చారు. అధికారులు కార్యాలయాల్లో ఉండకుండా గ్రామస్థాయిలో పర్య టిం చి ప్రజాసమస్యలను తెలుసుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కిరోసిన్ పంపిణీలో పక్కా మోసం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందనీ.. మోసా న్ని అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రేషన్‌షాపుల్లో 9రకాల నిత్యావసర సరుకులను ఒకేసారి సరఫరా చేసేలా తమ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. సరుకుల కేటాయింపులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చౌకదుకాణాల్లో ఇస్తున్న కొన్ని సరుకుల్లో నాణ్యత లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళలతో చర్చించి వాటి స్థానంలో వేరే వస్తువులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, డీఎస్‌వో విజయరాణి, డీఆర్వో శేష య్య, రెవెన్యూ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు పాల్గొన్నారు.