
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌తో పట్టుబడ్డ సిద్ధార్థ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్‌డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బులెట్‌కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?)
అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్‌కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment