
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ అధికారుల సోదాల్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇండిగో విమానంలో (6ఈ 7201) విజయవాడ వెలుతున్న సత్యదుర్గ అనే వ్యక్తి వద్ద 9ఎమ్‌ఎమ్ బులెట్లను సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.