
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్‌పై శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్‌లో బుల్లెట్‌తో విమానం ఎక్కడానికి ప్రయతి్నంచిన నేపథ్యంలో ఆయనపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పారీ్టలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచి్చన ఆయన తన బ్యాగేజ్‌ను కౌంటర్‌లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు.
ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదుచేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్‌చార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. బ్యాగ్‌లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment