paritala ravindra
-
పరిటాల శ్రీరామ్.. మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?
సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు. చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’) -
‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’
రాప్తాడు రూరల్: ‘బాబూ శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్‌ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర, మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్... మీ తాత కోసం మానాన్న ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్‌రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు. బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. -
పరిటాల సునీత కుమారుడి బ్యాగ్‌లో బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్‌పై శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్‌లో బుల్లెట్‌తో విమానం ఎక్కడానికి ప్రయతి్నంచిన నేపథ్యంలో ఆయనపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పారీ్టలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచి్చన ఆయన తన బ్యాగేజ్‌ను కౌంటర్లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదుచేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్చార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. బ్యాగ్‌లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ -
ఫ్యాక్షన్ రాజకీయాల్లో బడుగులే సమిధలు!
సాక్షి, అనంతపురం : పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే వాడు స్వార్థపరుడు.. మరి ఈ నేతలను ఏమంటారో జనమే చెప్పాలి.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఇలాంటి తరుణంలో ఆ నేతలు వారి స్వార్థానికి జైకొట్టి.. ఇన్నాళ్లూ ఎవరితోనైతే ఫ్యాక్షన్ నడిపారో ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గుల్లకుంట(బాంబుల) శివారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇరువైపులా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో ఆది పెద్దనాన్న దేవగుడి శంకర్‌రెడ్డి, బీమగుండం గోపాల్‌రెడ్డి హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకు వస్తుంటే.. షాద్‌నగర్ వద్ద బస్సు నిలిపేసి వారిద్దరినీ చంపారు. ఈ జంట హత్యలతో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. ఈ కేసులో ఇప్పటి టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి రెండేళ్లు శిక్ష అనుభవించారు. ఈ హత్యకు ప్రతీకారంగా 1993లో శివారెడ్డిని.. ఆది వర్గం చంపింది. ఈ రెండు కుటుంబాల మధ్య నడిచిన ఫ్యాక్షన్‌లో కనీసం 300 మంది బలయ్యారు. రాజకీయంగా రెండు కుటుంబాలు బలపడిన తర్వాత పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలాల్లో జరిగిన హత్యలు కోకొల్లలు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు పూర్తిగా తగలబెట్టారు. కొండాపురం మండలం కోడిగాండ్లపల్లి కూడా దహనమైంది. ఈ కేసుల్లో వందల మంది జైలు జీవితం గడిపారు. కర్నూలు, అనంతలో ఇదే తీరు.. కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. బైరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి, గౌరు బంధువు మద్దూరు సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయానికి కనీసం 30 మంది బలై ఉంటారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ ఏకమై టీడీపీలో చేరారు. కేఈ కృష్ణ్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబాల మధ్య మూడు తరాలుగా పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ మాదన్న కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో సహా చాలామంది బలయ్యారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. జేసీ కనుసన్నల్లోనే హత్య జరిగిందని మొన్నటి వరకూ పరిటాల కుటుంబం ఆరోపించింది. ఇపుడు జేసీ టీడీపీతో జట్టు కట్టడంతో పరిటాల శ్రీరాం, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగే పరిస్థితి. కృష్ణా జిల్లాలో కలకం రేపిన ఘటన వంగవీటి రంగా హత్య. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ‘ఫ్యాక్షన్’ తరహాలో ‘రౌడీయిజం’ నడిచింది. ఈ రెండు కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇక్కడ కూడా అనేక మంది బలయ్యారు. ఇప్పుడు వీరు కూడా గతం మరిచి టీడీపీలో కొనసాగుతున్నారు. కేఈ–కోట్ల, ఆది–రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపై తెచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి వీరంతా నిజంగా శాంతి కోసమో, తమ వర్గీయుల కోసమో రాజీ అయి ఉంటే నిస్వార్థంగా రాజీ కావాలి. కలిసిన ప్రతి కుటుంబం వెనుక స్వార్థ రాజకీయ కాంక్ష ఉంది. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజకీయ సమీకరణల నేపథ్యంలో చేతులు కలిపారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారు చీదరించుకుంటున్నారు. తిరిగి ఇలాంటి వారికి అండగా నిలిస్తే మళ్లీ వారి రాజకీయ ఎదుగుదల కోసం మళ్లీ ఫ్యాక్షన్ భూతాన్ని ఉసిగొల్పుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈనెల 11న ఏం చేయాలో అది చేస్తామని చెబుతున్నారు. హత్య జరినప్పుడు ఒకరిద్దరు నాయకులపై కేసు కడతారు. తర్వాత కోర్టులో కొట్టేస్తారు. కానీ నాయకుల వెంట తిరిగిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై మాత్రం రౌడీషీట్లు తెరిచారు. ఈ పరిస్థితిలో ‘మా కోసం బలైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నేతలు ఆలోచించలేదు. స్వార్థం కోసం మా త్యాగాలను కాదన్నారు. ఇలాంటి వారి కోసమా.. మేము ఇంతకాలం త్యాగాలు చేసింది?’ అని ఆయా వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. -
ఆచార్యా .. ఇది తగునా?
ఎస్కేయూ : సమాజంలో ఆదర్శప్రాయమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న వారు వీరు. దీనికి తోడు వర్సిటీ అత్యున్నతాధికారులు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ రాజకీయ నేతల వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకావడం పలు విమర్శలకు తావిస్తోంది. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాలను టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్కేయూ ఉన్నతాధికారులు రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ప్రసంగాలతో హోరెత్తించారు. ఎస్కేయూ రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వి.రంగస్వామి వర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.