బైరాగిగూడలో ఘటన
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్‌మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్‌మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు.
శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు.
పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్‌లకు సమీపంలో అపార్ట్‌మెంట్‌లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్‌లోకి బుల్లెట్‌లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment