
'జేసీ పేరు తలవటానికి కూడా ఇష్టపడను'
చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయటానికి తమ ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
తిరుపతి : చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయటానికి తమ ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు, పెనుకొండ తమకు రెండు కళ్లులాంటివన్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ తమ పాత్ర ఉంటుందని సునీత తెలిపారు.
కాగా మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరటంపై తాను ఏమీ వ్యాఖ్యలు చేయనన్నారు. జేసీ దివాకర్ రెడ్డి పేరు తలవటానికి కూడా తాను ఇష్టపడనని సునీత వ్యాఖ్యానించారు. కుమారుడితో కలిసి తిరుపతి వచ్చిన పరిటాల సునీతకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.