
సాక్షి, అనంతపురం(రాప్తాడు): టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత దళిత మహిళపై దౌర్జన్యం చేశారు. ‘ఏయ్..’ అంటూ చెయ్యెత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సోమవారం పరిటాల సునీత పర్యటించారు.
ఈ సందర్భంగా దళిత మహిళ, ఆశా కార్యకర్త అయిన ఆదిలక్ష్మిని కొట్టేందుకు ఆమె యత్నించారు. పరిటాల సునీత అనుచరుడైన రైటర్ కదిరప్ప భూముల విషయంలో తమను మోసం చేశాడంటూ కదిరప్ప సొంత అన్న నారాయణ కోడలైన ఆదిలక్ష్మి నిలదీసింది.
దీన్ని జీర్ణించుకోలేని పరిటాల సునీత తన వెంట ఉండే వ్యక్తి గురించి అలా మాట్లాడతావా అంటూ ఆదిలక్ష్మికి వేలు చూపుతూ బెదిరించడమే కాక.. ‘ఏయ్’ అంటూ గద్దించారు. ఆదిలక్ష్మి కూడా ఏమాత్రమూ తగ్గకుండా అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి మోసగాళ్లను పక్కన పెట్టుకుని తిరిగితే నీ పార్టీ నాశనం అయిపోతుందంటూ మండిపడింది.
చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..)
Comments
Please login to add a commentAdd a comment