rude behavior
-
పోలీసుల తీరుతో వల్లభనేని వంశీ భార్యకు ఇక్కట్లు
ఎన్టీఆర్, సాక్షి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన భార్య పంకజ శ్రీ(Pankaja Sri) సైతం ఇబ్బందికి గురయ్యారు. అడుగడుగునా పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అప్పటికప్పుడు ఆయన భార్య చేతిలో నోటీసులు పెట్టి తెలియజేశారు. ఆ పరిణామంతో ఆమె కంగారుపడిపోయారు. భర్త కోసం పోలీసుల వెనకాలే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో నందిగామ(Nandigama) వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. కంచికచర్ల సీఐ ఆ వాహనంలో కూర్చున్నారు. ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు. మునగచర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆమెను, డ్రైవర్‌ను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకుని.. ఆపై విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆమె నేరుగా కృష్ణలంక పీఎస్‌కు చేరుకోగా.. అక్కడా ఆమెను వంశీని చూసేందుకు అనుమతించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలు జరిగింది ఇదే..! -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం(రాప్తాడు): టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత దళిత మహిళపై దౌర్జన్యం చేశారు. ‘ఏయ్..’ అంటూ చెయ్యెత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సోమవారం పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా దళిత మహిళ, ఆశా కార్యకర్త అయిన ఆదిలక్ష్మిని కొట్టేందుకు ఆమె యత్నించారు. పరిటాల సునీత అనుచరుడైన రైటర్ కదిరప్ప భూముల విషయంలో తమను మోసం చేశాడంటూ కదిరప్ప సొంత అన్న నారాయణ కోడలైన ఆదిలక్ష్మి నిలదీసింది. దీన్ని జీర్ణించుకోలేని పరిటాల సునీత తన వెంట ఉండే వ్యక్తి గురించి అలా మాట్లాడతావా అంటూ ఆదిలక్ష్మికి వేలు చూపుతూ బెదిరించడమే కాక.. ‘ఏయ్’ అంటూ గద్దించారు. ఆదిలక్ష్మి కూడా ఏమాత్రమూ తగ్గకుండా అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి మోసగాళ్లను పక్కన పెట్టుకుని తిరిగితే నీ పార్టీ నాశనం అయిపోతుందంటూ మండిపడింది. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఓ రౌడీ షీటర్‌కు మహిళలు దేహశుద్ధి చేశారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పుస్తకాలు, పెన్నలు ఎరచూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు బడితెపూజ చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లిన చిన్నారావు.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినీలు.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం -
అంతా మా ఇష్టం
‘కరీంనగర్ నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన ఓ ఒప్పంద ఉద్యోగి తరువాత కమిషనర్ సీసీగా వెళ్లాడు. ఇటీవల కార్యాలయంలో విధులను పక్కకుపెట్టి లైక్ వీడియోలు చేయడం వైరల్‌గా మారింది. దీంతో తనను బదిలీ చేస్తారని ముందుగానే గమనించిన సదరు ఉద్యోగి ‘కమిషనర్ పేషీ సీసీ’ అని ఓ కొత్త పోస్టును సృష్టించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. కాగా వీడియోల వ్యవహారంపై ఇంతవరకు శాఖాపరమైన చర్యలు కానరాలేదు. సాధారణంగా మున్సిపల్ కమిషనర్లకు ఒక్కరే సీసీ పనిచేస్తారు. కరీంనగర్ నగరపాలకలో మాత్రం ఇద్దరు సీసీలు ‘ఇష్టా’రాజ్యం ఏలుతున్నారు.’ సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఔట్‌సోరి్సంగ్ పద్ధతిన సిబ్బ ందిని నియమిస్తారు. కొన్నేళ్లపాటు కాలపరిమితిని ఏర్పరుచుకుని విధులు అప్పగిస్తారు. కాలపరిమితి పూర్తవ్వగానే తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థంలో ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది రాజ్యమేలుతున్నారు. వీరిని కార్యాలయ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘అంతా మాఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కొలువులు కేటాయించుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది ఏర్పడితే తమకు నచ్చిన పోస్టింగ్‌లను వారే సృష్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒకశాఖలో ఉద్యోగులు పరిమితికి మించి ఉన్నా.. వారికి పదోన్నతి కల్పించాలన్నా.. బదిలీ చేయాలన్నా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆయా సిబ్బందికి శాఖలు కేటాయించి విధులు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ నిబంధనలు ఏమీ అమలు కావడం లేదు. అంతా ఔట్‌సోరి్సంగ్ రాజ్యమే నడుస్తోంది. ఫలితంగా సదరు ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుందని ముందుగానే గ్రహించి, అదే కార్యాలయంలో మరో పోస్టును సృష్టించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తున్నారా అంటే అదీ శూన్యమే. ఆడింది ఆట.. పాడింది పాట కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్కువగా ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులే. వీరిలో కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తే.. చాలా మంది ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు కేటాయించిన విధులు నిర్వహించకుండా ‘టైంపాస్’ ఉద్యోగం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కనీస మర్యాద పాటించకుండా దురుసుగా వ్యవహరిస్తున్నానేది బహిరంగ రహస్యం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అజమాయిషి చెలాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి వీరే విధులు కేటాయించడం విశేషం. కార్పొరేషన్లో 249మంది ఉద్యోగులు.. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం పోస్టులు 497. 249మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 248పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోరి్సంగ్ ద్వారా శానిటేషన్‌లో 857 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 260మంది, టౌన్ ప్లానింగ్‌లో 30 మంది, మెప్మాలో ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఏళ్లకాలంగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. దీంతో బదిలీపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను వీరు కంట్రోల్ చేస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అంతర్గత బదిలీలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీసీల బదిలీలు మాకు తెలియకుండా జరగవు. కార్పొరేషన్ ఇతర విభాగాలపై విచారణ చేస్తాం. సిబ్బందిని అవసరమైన చోట వినియోగిస్తాం. కొన్ని విభాగాల్లో అధికంగా సిబ్బంది ఉన్న విషయంపై విచారణ చేస్తాం. – వల్లూరి క్రాంతి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సొంతంగా ఏర్పరుచుకున్న పోస్టులు కొన్ని.. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సీసీగా ఉన్న వ్యక్తి మొదట కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్‌సోరి్సంగ్ విధానంలో ఉద్యోగంలో చేరాడు. ఆ పోస్టుకు కాలపరిమితి ముగుస్తుందని తెలిసి సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అనేపోçస్టును సృష్టించుకుని చేరిపోయాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడాకూడా సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు లేవు. అదీ ముగుస్తుందని తెలిసి ప్రస్తుతం కమిషనర్ సీసీగా చేరాడు. శానిటేషన్ విభాగంలో కీలకమైన ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ పోస్టుకు డిప్యూటీ ఈఈ క్యాడర్ కేటాయించారు. తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో ఓ ఉద్యోగిని తీసుకుని ఎన్విరాల్మెంట్ ఇంజినీర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆ స్థానానికి రెగ్యులర్ ఉద్యోగిని కేటాయించారు. అదే పోస్టులో తాత్కాలిక ఉద్యోగి సైతం కొనసాగుతుండం విశేషం. డిప్యూటీ ఈఈ నామమాత్రంగా మారి టెండర్లు పిలవడానికి పరిమితమయ్యాడని ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో కీలకమైన పోస్టుకు అధికారి ఉండగా.. ఒప్పంద ఉద్యోగిని కొనసాగించడం మన కార్పొరేషన్‌కే చెల్లింది. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో వీధిలైట్లను ఓ ప్రైవేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. వీధిదీపాల మేయింటనెన్స్‌కు ఏఈ, డీఈతో పాటు 13మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సూపర్వైజర్ పోస్టులు సృస్టించుకుని ‘లీడర్షిప్’ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఫిల్టర్‌బెడ్‌లో ఒక ఇన్చార్జితో పాటు ఐదుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవారు. 15ఏళ్ల నుంచి ఫిల్టర్‌బెడ్ పనితీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఉద్యోగుల మాత్రం ఐదునుంచి 15కు పెరిగారు. వాటర్‌బెడ్‌లో నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే విధులు నిర్వహించడానికి అవకాశముంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 12 మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది విధులు నిర్వహించడం విశేషం. -
దారుణంగా ప్రవర్తించారన్న దానికి ఈ వీడియో సాక్ష్యం
-
రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా అటెండర్
-
‘చెప్పుతో కొడతా.. ఎవరికీ భయపడను’
సాక్షి, గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది. ఆమెపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్ కేసు కాకుండా చూసేందుకు బాధితులను ఆస్పత్రి నుంచి పంపించివేశారు. మీడియాకు ఏమీ తెలపొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా అటెండర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. -
మీడియాపై ఏసీపీ రమణ దురుసు ప్రవర్తన
విశాఖపట్నం: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన సందర్భంగా మీడియాపై ఏసీపీ రమణ దురుసుగా ప్రవర్తించారు. అక్కడకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల సైతం దురుసుగా ప్రవర్తించడంతో ఆయన తీరుపై జర్నలిస్టులు తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణ, ఏజెన్సీలో అభివృద్ధి పనులపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాజనాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప, చిఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. -
వాద్రా వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. వాద్రా ప్రజాజీవితంలో లేరని, ఆయన ఎలాంటి హోదాలోనూ లేరని కాంగ్రెస్ పేర్కొంది. ప్రైవేట్ కార్యక్రమాల వద్ద వాద్రాను పదేపదే ప్రశ్నించడం సరికాదని వ్యాఖ్యానించింది. మీడియా ఇలాంటి వైఖరి విడనాడాలని సూచించింది. రాబర్ట్ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని అశోక హోటల్లో భూమి లావాదేవీలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన వాద్రా మైకును తోసేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా మీడియా ప్రతినిధుల పట్ల కఠినంగా ప్రవర్తించింది. విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని వాద్రా తన సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ స్పందించింది. -
అల్లుడా! మజాకా!!
న్యూఢిల్లీ: అల్లుడి గారికి కోపం వచ్చింది. విలేకరుల ప్రశ్నకు ఆయనకు ఒళ్లు మండిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలోని అశోక హోటల్లో భూమి లావాదేవీలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన వాద్రా మైకును తోసేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా మీడియా ప్రతినిధుల పట్ల కఠినంగా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా తాను విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని వాద్రా తన సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ** -
అమర్యాదగా టిడిపి నేతల ప్రవర్తన : భన్వర్‌లాల్
-
అమర్యాదగా టిడిపి నేతల ప్రవర్తన : భన్వర్‌లాల్
హైదరాబాద్: టిడిపి నేతల తీరుపట్ల ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ బాధను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓటు చెల్లదని ఎలా చెబుతారంటూ టిడిపి నేతలు భన్వర్‌లాల్‌ను ప్రశ్నించారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. చట్టంలో ఉన్నదే తాను చెప్పానని భన్వర్‌లాల్ చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేశామో మీ కార్యకర్తలంతా చెబుతారా? అని ఆయన టీడీపీ నేతలను నిలదీశారు. తాము ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేశానని చెప్పారు. ఓ ఎన్నికల అధికారితో ఇలా ప్రవర్తిస్తారా? అని అడిగారు. ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన 34 ఏళ్ల వృత్తి జీవితంలో ఏ పార్టీగాని, ఏ నాయకుడు గాని తనతో ఇలా వ్యవహరించలేదని చెప్పారు. టీడీపీ నేతల ప్రవర్తన అమర్యాదగా ఉందన్నారు. తన మీద ఏమైనా ఫిర్యాదులుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చునని భన్వర్‌లాల్ చెప్పారు. ఇదిలా ఉంటే, టిడిపి నేతలు భన్వర్ లాల్ పట్ల వ్యవహరించిన తీరును పలువురు నేతలు తప్పుపడుతున్నారు.