అమర్యాదగా టిడిపి నేతల ప్రవర్తన : భన్వర్లాల్ | TDP leaders rude behavior: Bhanwar Lal | Sakshi
Sakshi News home page

అమర్యాదగా టిడిపి నేతల ప్రవర్తన:భన్వర్లాల్

Published Wed, Apr 30 2014 6:39 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

భన్వర్లాల్ - Sakshi

భన్వర్లాల్

హైదరాబాద్: టిడిపి నేతల తీరుపట్ల ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్లాల్ బాధను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓటు చెల్లదని ఎలా చెబుతారంటూ టిడిపి నేతలు భన్వర్‌లాల్‌ను ప్రశ్నించారు. ఆయనతో   వాగ్వాదానికి దిగారు. చట్టంలో ఉన్నదే తాను చెప్పానని భన్వర్లాల్ చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేశామో మీ కార్యకర్తలంతా చెబుతారా? అని ఆయన టీడీపీ నేతలను నిలదీశారు. తాము ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేశానని చెప్పారు.  ఓ ఎన్నికల అధికారితో ఇలా ప్రవర్తిస్తారా? అని అడిగారు.

ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ  తన 34 ఏళ్ల వృత్తి జీవితంలో ఏ పార్టీగాని, ఏ నాయకుడు గాని తనతో ఇలా  వ్యవహరించలేదని చెప్పారు. టీడీపీ నేతల ప్రవర్తన అమర్యాదగా ఉందన్నారు. తన మీద ఏమైనా ఫిర్యాదులుంటే  చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు  ఫిర్యాదు చేసుకోవచ్చునని  భన్వర్‌లాల్‌ చెప్పారు.

ఇదిలా ఉంటే, టిడిపి నేతలు భన్వర్ లాల్ పట్ల  వ్యవహరించిన తీరును పలువురు నేతలు తప్పుపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement