కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన సందర్భంగా మీడియాపై ఏసీపీ రమణ దురుసుగా ప్రవర్తించారు.
విశాఖపట్నం: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన సందర్భంగా మీడియాపై ఏసీపీ రమణ దురుసుగా ప్రవర్తించారు. అక్కడకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల సైతం దురుసుగా ప్రవర్తించడంతో ఆయన తీరుపై జర్నలిస్టులు తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణ, ఏజెన్సీలో అభివృద్ధి పనులపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాజనాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప, చిఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.