చేతనైనంత చేయూత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు విభాగం ఆధునీకరణకు వీలైనంత సహాయం అందిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణకోసం నగరపోలీసు బల గాన్ని ఏవిధంగా ఆధునీకరించాలనే అంశంపై పోలీ సు ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమావేశం ముగిసిన అనంతరం రాజ్‌నాథ్ మీడియాకు తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు మరింత సమర ్థంగా, బాధ్యతాయుతమైన బలగాలుగా రూపొందాలంటే అం దుకు కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని ఆయ న అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థంగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. వారికి సహకరిస్తే మరింత సమర్థంగా పనిచేయగలుగుతారని చెప్పారు.
ఢిల్లీ పోలీసు ఆధునీకరణకు కేంద్రం సంపూర్ణ సహకారం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోం శాఖ మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్. బస్సీ, ప్రత్యేక కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, ఏసీపీలు, డీసీపీలు ఈసమావేశంలో పాల్గొన్నారు. నగరాన్ని సురక్షితంగా చేయడం కోసం చేపట్టిన చర్యల గురించి ఈ సమావేశంలో పోలీసు అధికారులు హోం మంత్రికి వివరించారు. నగరంలో ప్రస్తుత శాంతి భద్రతల స్థితిగతులు, నేరాల శాతం తగ్గించడం, నిరోధించడం, ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడం తదితరాలకు సంబంధించి తాము చేట్టిన చర్యలను అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా హోం మంత్రికి వివరించారు.
ఉగ్రవాద దాడులను నివారించడం కోసం తాము చేపట్టిన చర్యలతో పాటు, పోలీసు బలగాల స్థితిగతులను, వారి పనితీరును, వారి సామర్థ్యాన్ని ప్రజెంటేషన్ ద్వారా హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాగా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన దాదాపు రెండుగంటలపాటు గడిపారు. హోం శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. నగరంలో మహిళల భద్రత అంశం పై కూడా ఆయన అధికారులతో ఈ సందర్భంగా చర్చించారు. ఇందుకు తీసుకుం టున్న చర్యలను కమిషనర్ బస్సీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు ఈ సందర్బంగా వివరించారు.