
రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.
న్యూఢిల్లీ: అల్లుడి గారికి కోపం వచ్చింది. విలేకరుల ప్రశ్నకు ఆయనకు ఒళ్లు మండిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో భూమి లావాదేవీలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన వాద్రా మైకును తోసేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా మీడియా ప్రతినిధుల పట్ల కఠినంగా ప్రవర్తించింది.
అంతటితో ఆగకుండా తాను విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని వాద్రా తన సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు.
**