ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది.