Attender
-
సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు.అటెండర్‌ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్‌ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు.నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది. -
తిన్నింటికే కన్నం...రూ.40 లక్షలు స్వాహా
బంజారాహిల్స్: తన తండ్రికి సహాయంగా ఉండేందుకు నియమించిన అటెండర్ నమ్మక ద్రోహానికి పాల్పడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ. 40 లక్షల మేర నగదు డ్రా చేసి మోసగించాడంటూ ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఆర్ఆర్ఎస్ అర్ని(94) నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు విద్యుత్ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుండగా కూతురు హాంకాంగ్‌లో ఉంటున్నది. 2019లో తల్లి చనిపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉండేందుకు జనగామ సమీపంలోని చేల్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌ను నెలకు రూ.30 వేల జీతంతో 2017లో అటెండర్‌గా నియమించారు. ఆ ఇంట్లో ఉదయ్‌కిరణ్‌తో పాటు గార్డెనర్, డ్రైవర్, కుక్, పనిమనిషితో సహా నలుగు రు పని చేస్తుంటారు. తన తండ్రికి సేవలు సరిగ్గా లభిస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యుత్ అర్ని, కూతురు కలిసి ఇంట్లో 12 కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. తన తండ్రికి సమయానికి ఆహారం, మాత్రలు ఇస్తున్నారో లేదో కెమెరాల ద్వారానే తెలుసుకునేవారు. తన తండ్రి ఫోన్, కంప్యూటర్, ఐప్యా డ్ తదితర పనులను కూడా ఉదయ్‌కుమార్ చేసేవారు. ఇదే అదనుగా బ్యాంకు లావాదేవీలు చూసే క్రమంలో ప్రతి నెల ఇంటి ఖర్చులు డ్రా చేసే నిమిత్తం మూడేళ్లలో రూ.40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి తన జేబులో వేసుకున్నట్లుగా తేలిందన్నా రు. తాను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చానని ఇంటి లెక్కలు ఆడిట్ చేయగా రూ.40 లక్షలు అక్రమాలు తేలాయని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉదయ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది
సాక్షి,నాంపల్లి(హైదరాబాద్): ఆస్పత్రి అటెండర్ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన శనివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ ఆజం కుమారుడు షేక్ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి వెంటిలేటర్ అమర్చి వైద్యం అందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సుభాష్ అనే అటెండర్ శనివారం ఆ వార్డుకు వచ్చాడు. పక్క బెడ్ మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్ ఖాజాకు సంబంధించిన వెంటిలేటర్‌ను మార్చేశాడు. కొద్దిసేపటికే షేక్ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి.. -
కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేస్తోన్న అటెండర్ షబ్బీర్ కొద్దిరోజులుగా ఓ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో, పీసీసీ అధ్యక్షులుగా డి.శ్రీనివాస్, ఎం.సత్యనారాయణరావు, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు పనిచేసిన కాలంలోనూ షబ్బీర్ గాంధీభవన్‌లో పనిచేశారు. పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులకు ఆయన సుపరిచితులు. షబ్బీర్ మృతిపట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాయకులు దాసోజు శ్రావణ్ తదితరులు గాంధీభవన్‌లో షబ్బీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన తన పార్లమెంటు కార్యాలయాన్ని షబ్బీర్ చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం. చదవండి: నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
చేస్తున్నది అటెండర్ ఉద్యోగం.. చేసేది కలెక్టర్ సంతకం
సాక్షి, శ్రీకాకుళం: చేస్తున్నది అటెండర్ ఉద్యోగం.. చేసేది మాత్రం కలెక్టర్ సంతకం. కలెక్టర్‌గానే కాదు దేవదాయ శాఖ ఏసీ, తహసీల్దార్ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి డీ పట్టాలు, ఉద్యోగ నియామక పత్రాలను సృష్టించాడీయన. టెక్కలి దేవదాయ శాఖలో కంటింజెంట్ ప్రాతిపదికన అటెండర్‌గా పనిచేస్తున్న బెలమర ధర్మారావు ఫోర్జరీ బాగోతమిది. ఈయన వ్యవహారాన్ని కార్యాలయం ఈఓ వీవీఎస్ నారాయణ పసిగట్టి ఆదివారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం భగవాన్‌పురం గ్రామానికి చెందిన బెలమర ధర్మారావు టెక్కలి దేవదాయ శాఖ కార్యాలయంలో కంటింజెంట్ ప్రాతిపదికన 5 వేల రూపాయల వేతనానికి అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల విక్రయాలపై కన్నేసిన ధర్మారావు దీనికి పక్కాగా ప్లాన్ వేశాడు. కార్యాలయంలో ఉన్న పత్రాలను పోలిన కొన్ని రకాల డీ పట్టాలను సృష్టించాడు. చదవండి: టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం దీని పై కలెక్టర్ సంతకాలు, దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ పేరుతో ఉన్న సీలు, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి కొంత మంది వ్యక్తులకు అమ్మేశాడు కూడా. వీటితో పాటు దేవదాయ శాఖలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి విజయవాడలో గల దేవదాయ కమిషనర్ పేరుతో నకి లీ పత్రాలను సృష్టించాడు. అయితే ధర్మారావు నకిలీ ప త్రాలు సృష్టించి వాటిని అమ్మకాలు చేశాడు తప్ప భూము లు చేతులు మారలేదు. దీంతో గత కొంత కాలంగా ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ధర్మారావు కార్యాలయానికి తరచూ గైర్హాజరు కావడంతో ఈఓకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ధర్మారావు కోసం తరచూ కార్యాలయానికి వస్తుండడంతో ఈఓ వీవీఎస్ నారాయణ తనదైన శైలిలో దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఈఓతో పాటు జూనియర్ అసిస్టెంట్ ఎన్.ఆదినారాయణ తదితరు లు హుటాహుటిన టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ధర్మారావు 10 మంది వ్యక్తులకు పట్టాలను విక్రయించి సుమారు 1 ల క్షా 40 వేల రూ పాయలు వ సూలు చేసిన ట్లు ప్రాథమికంగా తేలింది. దేవదాయ అధికారులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చదవండి: మామపై అల్లుడు బాణం..! -
డ్యూటీ.. లూటీ
ఎస్వీయూ పరీక్షల విభాగం పనితీరు రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆ విభాగంలోఅన్ని వ్యవహారాలు అత్యంతజాగ్రత్తగా, పకడ్బందీగా జరగాలి. అధికారి నుంచి అటెండర్ వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి. జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ఇందుకోసంయూనివర్సిటీ ఉద్యోగులకుఆన్ డ్యూటీ సౌకర్యంతో పాటు లక్షలాది రూపాయలను అలవెన్సులుగా ఇస్తోంది. అయితే అక్కడి ఉద్యోగులువిధులకు వెళ్లకుండానే నిధులు మింగేస్తున్నారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి.మంగళవారం వెలుగుచూసిన సంఘటన ఇందుకు నిదర్శనం. యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ పరీక్షల నియంత్రణాధికారి పేరుతో జరగాలి. అయితే లా విభాగం పరిధిలోని ఎల్ఎల్బీ కోర్సు పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన రీవాల్యుయేషన్ జవాబు పత్రాల బండిల్ మంగళవారం పరీక్షల విభాగంలో పనిచేసే ఒక అటెండర్ పేరిట కొరియర్ వచ్చింది. దీన్ని చూసి అధికారులు విస్తుపోతున్నారు. నిబంధనలు ఇలా.. పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు దరఖాస్తు చేస్తే త్వరితగతిన ఫలితాల విడుదలకోసం కొంతమంది ఉద్యోగులను ఈ విధులకు కేటాయిస్తారు. ఆ సిబ్బంది సంబంధిత జవాబు పత్రాల బండిళ్లను పకడ్బందీగా సీల్ చేయించి వ్యక్తిగతంగా తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారికి ఇవ్వాలి. మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత జవాబు పత్రాలను పకడ్బందీగా సీల్ చేయించుకుని వ్యక్తిగతంగా తీసుకుని రావాలి. ఆ విధులకు యూనివర్సిటీ తగిన అలవెన్స్ చెల్లిస్తుంది. జరుగుతున్నది ఇదీ.. నిబంధనల ప్రకారం పరీక్షల విభాగం సిబ్బంది జవాబు పత్రాలను వ్యక్తిగతంగా తీసుకెళ్లకుండా పోస్ట్ ద్వారానో, ఇతరుల ద్వారానో పంపి, వాటిని తిరిగి తెప్పించుకుంటున్నారు. తాము వ్యక్తిగతంగా వెళ్లి వచ్చినట్లు బిల్లులుతీసుకుంటున్నారు. తాము వెళ్లకుండా ఓడీ రూపంలో లక్షలాది రూపాయల నిధులు కొల్లగొడుతున్నారు. ఇంతా జరుగుతున్న సంబం«ధిత సెక్షన్లలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, ఏఏఓలు ఏం చేస్తున్నారన్నది శేష ప్రశ్న. అవకతవకలెన్నో? పరీక్షల విభాగంలోని ఒక అటెండర్ పేరిట మంగళవారం కొరియర్ రావడంతో వర్సిటీ అధికారులు అవాక్కయ్యారు. పరీక్షల విభాగంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ఈ పార్సిల్ కాకినాడలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంస్థ నుంచి వచ్చింది. లా పరీక్షల రీవాల్యుయేషన్‌కు సంబంధించిన పార్సిల్‌గా గుర్తించారు. వాస్తవంగా ఈ బండిల్‌ను ఈ విధుల కోసం కేటాయించిన సిబ్బంది వ్యక్తిగతంగా వెళ్లి తీసుకురావాలి. కానీ అలా జరగలేదు. పరీక్షల నియంత్రణాధికారి పేరిట కాకుండా ఒక అటెండర్ చిరునామాతో పార్సిల్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఎంత కాలంగా సాగుతుందో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. నా దృష్టికి రాలేదు అటెండర్ పేరుతో మూల్యాంకన పత్రాలు రావడంపై పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తానని చెప్పారు. -
సిరిసిల్ల జిల్లాలో అమానుషం!
సాక్షి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ అటెండర్ కనకయ్యతో చెప్పులు తుడిపించారు. ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై డీఎమ్హెచ్వో చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ‘చెప్పులపై క్యాండిల్ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే.. అటెండర్ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు. ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్ తెలిపారు. -
అటెండర్‌తో చెప్పులు తుడిపించిన డీఎంహెచ్‌వో!
-
చంద్రయ్య విషాదాంతం
పెద్దఅంబర్‌పేట, శంషాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నవంబర్ 4న విజయారెడ్డిపై కార్యాలయంలోనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డిని కాపాడబోయిన కారు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. అయితే, గురునాథం 5న చికిత్స పొందుతూ మృతి చెందగా, హత్యకు కారణమైన కూర సురేశ్ 8న మృతిచెందాడు. ఇక చంద్రయ్య డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ సోమవారం ప్రాణాలొదిలాడు. మృతులందరికీ చిన్నపిల్లలే.. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికీ చిన్న పిల్లలే ఉన్నారు. విజయారెడ్డికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడు సురేశ్‌కు కూతురు, కుమారుడు, డ్రైవర్ గురునాథంకు ఏడాదిన్నర వయసు కుమారుడు, అటెండర్ చంద్రయ్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. రాళ్లగూడలో అంత్యక్రియలు చంద్రయ్య అంత్యక్రియలు సోమవారం శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడలో జరిగాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన చంద్రయ్య జిల్లాల విభజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో అటెండర్‌గా నియమితులయ్యా రు. ఆయన తన భార్య పద్మమ్మ, పిల్లలు అభినవ్, కీర్తనలతో కలసి ఉంటున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం వైద్యం చేయించినా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేదని కుటుంబ సభ్యులన్నారు. ట్రెసా చేయూత సాక్షి, హైదరాబాద్: చంద్రయ్య కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) బాసటగా నిలిచింది. అత్యవసర ఖర్చులకుగాను చంద్రయ్య కుటుంబ సభ్యులకు ట్రెసా సంఘం నాయకులు రూ. లక్ష అందజేశారు. డ్యూటీకి వెళ్లిన రోజు నుంచి మళ్లీ ఇప్పుడే.. డ్యూటీకి వెళ్లిన రోజు మా నాన్నను చూశాం.. ఆ తర్వాత మేము ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ఈ రోజు చనిపోయాడని చెప్పారు. మా నాన్న బతికుండగా చూసి చనిపోయిన తర్వాత మళ్లీ ఈరోజే చూడాల్సి వచ్చింది. మా నాన్ననే ఇంటికి ఆధారం.. మేము ఇప్పుడు పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని ఎవరు చదివిస్తారు.. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చంద్రయ్య కుమారుడు అభినవ్, కుమార్తె కీర్తన -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్‌డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
బాలికపై స్కూల్ అటెండర్ వేధింపులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్‌చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు నెలల క్రితం లైంగిక దాడికి యత్నం.. సర్వర్ సదరు బాలికపై ఐదు నెలల క్రితం కూడా లైంగిక దాడికి యత్నించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో అసభ్యకరంగా ప్రవర్తించినా చిన్నారి భయపడి విషయం తమకు చెప్పలేదని, మళ్లీ అలాగే ప్రవర్తించడంతో శనివారం ఏడ్చుకుంటూ వచ్చి విషయం చెíప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు స్థానికులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థి సంఘాల ధర్నా పేదరికంతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే పాఠశాల సిబ్బందే లైంగిక వేధింపులకు పాల్పడడంపై విద్యార్థి సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుడు సర్వర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేసిన అనంతరం పోలీసుల జోక్యంతో విరమించారు. సర్వర్‌ను విధుల నుంచి తొలగించిన ఎంఈవో విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన సర్వర్‌ను అటెండర్ విధుల నుంచి తొలగిస్తూ మండల విద్యాధికారి డానియేల్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, బెదిరించినా బాధితులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వర్‌పై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. గోదావరిఖనిటౌన్(రామగుండం): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్‌చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా అటెండర్
-
‘చెప్పుతో కొడతా.. ఎవరికీ భయపడను’
సాక్షి, గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది. ఆమెపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్ కేసు కాకుండా చూసేందుకు బాధితులను ఆస్పత్రి నుంచి పంపించివేశారు. మీడియాకు ఏమీ తెలపొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా అటెండర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. -
మహిళా అటెండర్ ఆత్మహత్య
అనంతపురం , కళ్యాణదుర్గం: ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కవిత (24) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి గౌరమ్మ తెలిపిన సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు నౌకరు పనిచేస్తూ చనిపోవడంతో పదో తరగతి చదువుకున్న కవితకు ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం లభించింది. ఈమె స్వస్థలం బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర. ఉద్యోగం రావడంతో కవిత తన తల్లితో కలిసి కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లిలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి యథావిధిగానే ఇద్దరూ బయట గదిలో పడుకున్నారు. తల్లి గాఢ నిద్రలో ఉండగా కవిత లోపలి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పైకప్పు కడ్డీకి చీరతో ఉరివేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో తల్లి లేచిచూడగా కుమార్తె పక్కన కనిపించలేదు. లోపలి గది తలుపులు మూసి ఉండటంతో గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చింది. స్థానికులు వచ్చి లోపలికెళ్లి చూడగా కవిత ఉరికి వేలాడుతూ కనిపించింది. పెళ్లి సంబంధం కుదరకపోవడం, కడుపునొప్పితో బాధపడుతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కవిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రవీంద్రలు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. -
డాక్టర్ నుంచి స్వీపర్ వరకు అన్నీ అటెండరే
విశాఖపట్నం, చీడికాడ(మాడుగుల): అది మండలంలోని ఏకైక హోమియో వైద్యశాల. అక్కడ పనిచేసే సిబ్బంది ఏడాదిన్నర క్రితం బదిలీపై వెళ్లి పోవడంతో డాక్టర్ నుంచి స్వీపర్ వరకు అన్నీ విధులు అటెండర్ అరుణే నిర్వహించవలసి వస్తోం ది. వివరాలలోకి వెళితే మండలంలోని ఖండివరం హోమియో వైద్యశాలకు ఖండివరంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన శిరిజాం, వి.బి.పేట, ఎల్.బి.పట్నం, బి.సింగవరంతో పాటు మండలం నలుమూలల నుంచి వృద్ధులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు వచ్చి వైద్యసేవలు పొందుతారు. ప్రతిరోజు 35 నుంచి 40 మంది మంది అవుట్పేషంట్లు ఉంటారు. ఈ వైద్యశాలలో ఒక డాక్టర్, ఒక ఫార్మసిస్ట్,ఒక అటెండర్,ఒక స్వీపర్ ఉండాలి. ఇక్కడి డాక్టర్, ఫార్మసిస్ట్ ఏడాదిన్నర క్రితం సాధారణ బదిలీల్లో వేరే వైద్యశాలకు వెళ్లారు. వారి స్థానంలో ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ నియమించలేదు. అయితే ఇదే వైద్యశాలకు అటెండర్ అరుణ బదిలీపై వచ్చింది. నాటి నుంచి ఈ ఆస్పత్రిలో అన్ని సేవలు ఆమే నిర్వహిస్తోంది. తనకు తెలిసిన మేరకు రోగులకు మందులు అందిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామపెద్దలు సుంకర శ్రీను,షేక్ సూర్యనారాయణ, మోసూరి సన్నిబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని, డాక్టర్ లేక పోవడంతో నిరాశతో వెనుదిగుతున్నారని తెలి పారు. వెంటనే వైద్యుడిని నియమించాలని వా రు కోరారు. అటెండర్ అరుణ మాట్లాడుతూ జీతం, ఇతర బిల్లులు పెట్టడానికి మాత్రమే ఇన్చార్జిని ఇచ్చారని, వైద్యం కోసం ఎవరినీ నియమించలేదని తెలిపింది. ఏడాదిన్నర నుంచి ప్రతి రోజు రోగులు వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లిపోతుంటే బాధగా ఉందని, రోగులకు సమాధానం చెప్పలేక పోతున్నానని తెలిపింది. -
వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం
విజయనగరం ఫోర్ట్: వార్డెన్ వేధింపులు భరించలేక ఓ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన లెంక అనసూర్య (29) పట్టణంలోని దాసన్నపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తోంది. 2016లో అనసూర్య జాయిన్ అయినప్పటి నుంచి వార్డెన్ రాణి ఆమెను వివిధ రకాలుగా వేధిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా తయారుకావడంతో అనసూర్య బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్లోనే చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అటెండర్ కుమార్తె స్టేట్ ఫస్ట్
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఓ అటెండర్ కుమార్తె రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. టెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కర్నూలు నగరంలోని పూలబజార్‌కు చెందిన సి.పద్మాజీరావు, హేమ దంపతుల కుమార్తె సి.భారతి పేపర్–1లో 150 మార్కులకు 141 సాధించారు. తద్వారా మొదటిర్యాంకు కైవసం చేసుకున్నారు. పద్మాజీరావు చేనేత, జౌళి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె సి.భారతి 2014–16 విద్యా సంవత్సరంలో డీఎడ్ పూర్తి చేశారు. టెట్ పరీక్షకు మొదటిసారి హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాన్ని రాబట్టారు. ఈమె ప్రాథమిక, సెకండరీ విద్య అంతా కర్నూలులోని కింగ్ మార్కెట్ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ హజీరా కాలేజీలో పూర్తి చేశారు. పద్మాజీరావు తనలా పిల్లలు ఉండకూడదని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తున్న భారతి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్నారు. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. టెట్ కోచింగ్‌ను స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్లో తీసుకున్నారు. ఆరు నెలల పాటు రోజుకు పది గంటల పాటు ప్రిపేర్ అయ్యారు. టెట్ ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు.. పేపర్–1లో జిల్లా అభ్యర్థులు సి.అష్మా (136 మార్కులు), సన శైలజ (133), బోయ శివ (133), కంబహం రోహిణి (132), కురువ హరిప్రసాద్ (132) అత్యుత్తమ మార్కులు సాధించారు. విశ్వవాణి విజయభేరి టెట్ ఫలితాల్లో విశ్వవాణి కోచింగ్ సెంటర్ అభ్యర్థులు విజయభేరి మోగించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్కే మద్దిలేటి తెలిపారు. టెట్–3లో ఆర్.ప్రసన్న లక్ష్మి (118 మార్కులు), పి.వెంకటేశ్వరి (118), మైమున్సీ (116), రామకృష్ణ (115), గోపీనాథ్ (118), సుజాత (116), ప్రసాదరావు (115)తో పాటు మరో పది మంది రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని ఆయన వెల్లడించారు. టీచర్స్ అకాడమీ... టీచర్స్ అకాడమీలో టెట్ శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 90 శాతం అర్హత సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీరామ్ తెలియజేశారు. 400 మందికి పైగా 125 మార్కులు సాధించారన్నారు. ఎంతో అనుభవం ఉన్న అవనిగడ్డ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం వల్లే సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. విజేత కోచింగ్ సెంటర్... స్థానిక విజేత స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో టెట్ శిక్షణ తీసుకున్న వారిలో పేపర్–1లో 130 నుంచి 140 మార్కుల మధ్య 8 మంది, 100 నుంచి 130 మార్కుల మధ్య వంద మందికి పైగా సాధించినట్లు ఆ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎం.వి.రమణ, అకడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 92 శాతం మంది అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. -
అవినీతికి అటెండర్
పేరు కొండపల్లి శ్రీనివాస్. చేసేది వాణిజ్యపన్నుల శాఖలో అటెండర్ ఉద్యోగం. అయితేనేం.. వన్‌టౌన్‌లోని వ్యాపారులను హడలెత్తిస్తాడు. కమర్షియల్ ట్యాక్ ఆఫీసర్ తరహాలో ఆయనే వాహనాలను తనిఖీ చేస్తాడు. జీరో వ్యాపారంపై దృష్టిపెట్టి వేలాది రూపాయలు ముడుపులు వసూలు చేస్తాడు. ఓ ఉన్నతాధికారి అండతో కోట్లకు పడగలెత్తి, వ్యాపారులను శాసిస్తున్న ఈ అటెండర్ బాగోతాన్ని కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షి, విజయవాడ: దేశంలోని ప్రధాన నగరాల నుంచి రెడీమేడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర లక్షల రకాల వస్తువులు రైలుమార్గంలోని విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయానికి వస్తాయి. అక్కడి నుంచి ఆ వస్తువులు నగరంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు చేరతాయి. ఈ సరుకులో ఎక్కువ భాగానికి వ్యాపారులు పన్ను చెల్లించరు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖలోని సిబ్బందికి బాగా తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ వన్‌టౌన్‌లో ఉండే కొండపల్లి శ్రీనివాస్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒంటరిగా తనిఖీలు వాణిజ్యపన్నుల శాఖలో వాహనాలు తనిఖీ చేయాలంటే జాయింట్ కమిషనర్ లేదా సీటీవో స్థాయి అధికారి ఆదేశాలతో డీసీటీవో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇవేం అవసరం లేదు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఒక్కడే వాహనాలు తనిఖీ చేస్తాడు. సరకుతో వెళ్తున్న రిక్షాలు, ఆటోలు, వ్యాన్లను ఆపి బిల్లులు తనిఖీ చేస్తాడు. బిల్లులో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే సరకు సీజ్ చేస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు వ్యాపారి కాళ్లబేరానికి వస్తే ముడుపులు తీసుకుని వదిలేస్తాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాడని సమాచారం. ఎవరైనా వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారితో భారీగా జరిమానాలు వేయించగల సమర్థుడు. కేవలం అటెండర్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు డీసీటీవో స్థాయిలో తనిఖీలు చేయడం గమనార్హం. ఒక డివిజన్‌కు చెందిన డీసీటీవోలు మరో డివిజన్ పరిధిలోకి వెళ్లి తనిఖీలు చేయరు. అయితే, డివిజన్–2 పరిధిలోని ఉయ్యూరు సర్కిల్‌కు చెందిన శ్రీనివాస్, డివిజన్–1 పరిధిలోకి వెళ్లి వాహనాలను ఆపడం వ్యాపారులకు విస్మయం కలిగిస్తోంది. తనిఖీలపై వీడియో శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కొంతమంది బాధితులు వీడియోలు, ఫొటోలు తీసి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌తోపాటు జాయింట్ కమిషనర్లకు పంపారు. దీనిపై జాయింట్ కమిషనర్–2 రఘునా«థ్ స్పందిస్తూ ఈ వీడియోపై విచారణ చేయాలని ఉయ్యూరు సీటీవో విజయభాస్కర్‌ను ఆదేశించారు. రంగంలోకి ఉన్నతాధికారి శ్రీనివాస్‌కు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో డివిజన్–2 కార్యాలయంలో పనిచేశారు. ఆ అధికారిపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఆ అధికారి శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తామే తనిఖీలు చేయించామంటూ నివేదిక ఇవ్వాలంటూ డివిజన్–1 కార్యాలయానికి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. విచారణకు ఆదేశించాం కొండపల్లి శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎవరో నాకు వీడియో పంపారు. దాని గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఉయ్యూరు సీటీవోను ఆదేశించాను. ఆదేశాల మేరకే విచారణ చేశారా? ఎప్పుడు చేశారు? పక్కన ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? శ్రీనివాస్ ఒక్కడే తనిఖీలు చేశాడా? అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌ను విచారించి సీటీవో నివేదిక ఇస్తారు. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను. – రఘునాథ్, జాయింట్ కమిషనర్ -
అమ్మా క్షమించు..
బి.కొత్తకోట/చిత్తూరు ఎడ్యుకేషన్: ‘అమ్మా నన్ను క్ష మించు.. నేను బతికుండి రోజూ చావలేను.. అందుకే ధైర్యం చాలక మద్యం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని తల్లికి సూసైడ్ నోట్ రాసి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న డి.శ్రీకాంత్‌రెడ్డి (27) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపుల గ్రామానికి చెందిన డి.వెంకటరెడ్డి ఉపాధ్యాయుడు. ఆయన బి.కొత్తకోట మండలం శీలం వారిపల్లె పంచాయతీ గుంతావారిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. 2015 వరకు ఇక్కడి పనిచేసిన ఆయన పీటీఎం మండలానికి బదిలీ అయ్యా రు. పల్లె వాతావరణంలోనే నివాసముండాలని గుంతావా రిపల్లె సమీపంలో 25 కుంటల భూమిని కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయన ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇంటర్ వరకు చది విన కుమారుడు డి.శ్రీకాంత్‌రెడ్డికి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. అతను 6 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులు సెలవు తీసుకుని సొంతూ రు వచ్చాడు. ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఇతనికి అక్క సంధ్య, తల్లి రమాదేవి ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఇన్చార్జ్ ఎస్ఐ కేవీహెచ్.నాయుడు, ఏఎస్ఐ టీ.ప్రసాద్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. రమాదేవి ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యం కోసం బెంగళూరు వెళ్లారు. వారికి సమాచారం అందించారు. అమ్మా నిన్ను బాధపెడుతున్నా.. అత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి సూసైడ్ నోట్ రా శాడు. అందులో ‘సారీ మా.. నా తలలో ఏదో దూరింది.. నేను బతికుండి రోజూ చావలేను.. నా మెంటల్ కండీషన్ బాగోలేదు.. నన్ను క్షమించు మా నిన్ను బాధపెడుతున్నందుకు. నేను జాబ్‌లో చేరినప్పటి నుంచి హ్యాపీగా లేను. కొద్దిరోజులైతే అలవాటుపడతాననుకొన్నా. కానీ నావల్ల కావడం లేదు. నాన్న ఉన్నప్పుడు నేను ఇలా లేను. నా మనసు ఈ జీవితానికి అలవాటు పడట్లేదు. మా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడకు. నా ఆత్మకు శాంతి ఉండదు. మా నువ్వు, నా ఫ్రెండ్స్ బాగుండాలి. డోంట్ క్రై మా.. సారీ మా.. మిస్ యూ మా. లేఖలో తప్పులున్నా యి ఎందుకంటే తాగి ఉన్నాను క్షమించు మా.. సారీ ఫ్రెండ్స్ తాగడానికి కారణం చావడానికి ధైర్యం చాలలా.. సంధ్య అమ్మను బాగా చూసుకో. నా చావుతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు’ అంటూ సంతకం చేసి ముగించాడు శ్రీకాంత్‌రెడ్డి. స్నేహితులకు వాయిస్ రికార్డ్ ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులకు వాయిస్ రికార్డ్ పంపించాడు. అందులో మా సారీ మా.. బాయ్ మా.. నేను వెళ్లిపోతున్నా.. అని ఉంది. వాయిస్ రికార్డును చూసిన మిత్రులు అనుమానంతో శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేసినా స్పందించలేదు. మదనపల్లె నుంచి ఇద్దరు మిత్రులు గురువారం ఉదయమే గుంతావారిపల్లెకు చేరుకున్నారు. కిటికీలోంచి చూడగా శ్రీకాంత్‌రెడ్డి ఉరివేసుకొని మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి తమతో కలిసి మదనపల్లెలో చదువుకున్నాడని మిత్రులు వినోద్, సుధాకర్, ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు శ్రీకాంత్‌రెడ్డి మంచివాడు. ఆరు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా.. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు తీసుకున్నాడు. ఇక్కడ అతనికి వేధింపులు, ఇబ్బందులు ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. – పాండురంగయ్య, డీఈవో, చిత్తూరు -
పశువైద్యాధికారికి బదులుగా...
ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడని అనుకుంటే పొరపాటు పడినట్టే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్యకేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు. ఇక్కడ ఓ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదు. అంటూ తప్పించుకున్నారు. కాగా ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
కోర్టు అటెండర్ నియామకాలు రద్దు
కమాన్‌చౌరస్తా : జిల్లా కోర్టులో అటెండర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా న్యాయమూర్తి వై. రేణుక తెలిపారు. జిల్లాలో 53 ఉద్యోగాల భర్తీ కోసం 2014 ఆగస్టు 12న ప్రకటన వచ్చింది. 11200 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. అర్హులైన అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 300 మంది అభ్యర్థుల చొప్పున అప్పటి న్యాయమూర్తి బి. నాగమారుతిశర్మ రెండు నెలలపాటు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టుకు పంపించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అటెండర్ నియామాకాలను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. తదుపరి నియామకాలు హైకోర్టు ఆదేశానుసారమే ఉంటాయన్నారు. -
జెండా ఆవిష్కరించిన అటెండర్
ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం మహబూబ్‌నగర్‌టౌన్: జెండా ఆవిష్కరణ సమయం మించిపోవడం.. కమిషనర్ రాకపోవడంతో అటెండర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్యాలయంలో జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఉదయం ఎనిమిది గంటలైనా కమిషనర్ దేవ్‌సింగ్ కార్యాలయానికి రాలేదు. అప్పటికే కౌన్సిల్ సభ్యులు, పుర ప్రముఖులు వచ్చారు. ఆయన వస్తున్నారా.. రారా అన్న సమాచారం కూడా లేదు. చివరికి 8.15 గంటలకు అటెండర్ బుచ్చయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున అధికారులే జెండావిష్కరణ చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసి కూడా కమిషనర్ సమయానికి రాకపోవడంపై అక్కడున్న పుర ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ టీకే శ్రీదేవి విచారణకు ఆదేశించారు. దీనిపై కమిషనర్ దేవ్‌సింగ్ మాట్లాడుతూ తాను కేవలం ఎస్టీ అధికారిననే దురుద్దేశంతోనే జెండా ఆవిష్కరణలో తనను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్‌తో జెండాను ఆవిష్కరింపజేసి సోషల్ మీడియాలో చేసిన ప్రచారం తనను కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ తెలిపారు. -
బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..
-
చిన్నారితో పాఠశాల అటెండర్ అసభ్యప్రవర్తన
ఆదిలాబాద్: నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ పాఠశాల అటెండర్ అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. వివరాలివీ.. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని ఆల్ఫోన్సా పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థినితో ఆ పాఠశాల అటెండర్ శ్రీనివాస్ సోమవారం ఉదయం అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు ఆ విషయం తెలిపింది. దీంతో వారు కుటుంబసభ్యులతో కలసి మంగళవారం పాఠశాలకు వచ్చి, నిర్వాహకులను నిలదీశారు. అటెండర్ శ్రీనివాస్‌ను చితకబాదారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్ నాయకులు పాఠశాలకు ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి ప్రై వేటు పాఠశాలలను బంద్ చేయించారు. ఎంఈవో పోచయ్య విచారణ జరిపారు. నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాకేష్ తెలిపారు. -
మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య
చింతలపూడి : ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడికి చెందిన కాళ్ల రమణారావు(45) అనే వ్యక్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తమ నుంచి వసూలు చేసిన ఫీజులను సొంత పనులకు వాడుకున్నాడంటూ విద్యార్థులు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయుడు రమణారావును మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమణారావు సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కాగా ఈరోజు ఉదయం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని పొలాల్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్లో తన చావుకు అధ్యాపకుల తీరే కారణమని పేర్కొన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రాబ్యాంక్ లో చోరీకి యత్నం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఆంధ్రాబ్యాంక్ లో చోరీకి ఒక వ్యక్తి విఫల యత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఒక పథకం ప్రకారం అతడు బ్యాంకులోకి ప్రవేశించాడు. బ్యాంకులోకి ప్రవేశించగానే తనకు అడ్డొచ్చిన అటెండర్ వెంకటస్వామిపై కత్తితో దాడిచేశాడు. దీంతో వెంకటస్వామికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమించడంతో బ్యాంకుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
అటెండర్
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీ బ్యాంకుల దోపిడీ ఘటన ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. జిల్లా లో ఎప్పుడూ జరగని విధంగా భూపాలపల్లి, ఆజంనగర్ శాఖ బ్రాంచీల్లో ఒకేసారి చోరీ జరగడం తో ఏదో పెద్ద ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని సవాల్‌గా తీసుకున్నరూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా భూపాలపల్లిలోనే తిష్టవేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్నంతా ఇక్కడికి రప్పించి విచారణ ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, ములుగు డీఎస్పీ మురళీధర్‌తోపాటు జిల్లాలోని వివిధ డివి జన్ల డీఎస్పీలు, సీఐలు.. అర్బన్, రూరల్ సీసీఎస్ పోలీసులు అక్కడే మకాం వేశారు. భూపాలపల్లి బ్రాంచిలో పని చేసే తాత్కాలిక ఉద్యోగి ఈ దోపిడీకి సూత్రధారిగా తేలి నట్లు సమాచారం. అతడికి ఒకరిద్దరు మాత్రమే సహకరిం చినట్లు తెలుస్తోంది. రెండు బ్యాంకుల్లో రూ.9,44,83,100 విలువైన బంగారం, నగదును దోచుకెళ్లగా.. దొంగల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బ్రాంచీల ఉద్యోగులందరినీ సోమవారం అదుపులోకి తీసుకుని ఠాణాలో విచారిస్తున్నారు. భూపాలపల్లి బ్రాంచి తాత్కాలిక ఉద్యోగి అటెండర్ రమేష్ విధులకు హాజరు కాలేదు. అతని మొబైల్ స్విచాఫ్ ఉండడంతో పట్టణంలోని అతడి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి బంధువులు, స్నేహితులను ఆరా తీయగా.. తిరుపతి వెళ్తున్నానని చెప్పినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. బ్యాంకుల సిబ్బందికి చెందిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించగా.. రమేష్ ఇతర బ్రాంచీలకు చెందిన ఉద్యోగులతో పలుమార్లు మాట్లాడినట్లు తేలింది. ఈ నెల 16న కూడా అతడు సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు వెల్లడైంది. సోమవారం నుంచి సెల్‌ఫోన్ స్విచాఫ్ వస్తోంది.ఈ నేపథ్యంలో పోలీసులకు రమేష్‌పై అనుమానం బలపడింది. లాకర్ తయారు చేసిన గోద్రెజ్ సంస్థ ప్రతినిధులను పోలీసులు రప్పిం చి చూపించారు. అది అసలు తాళపు చెవులతోనే తెరిచినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు చోరీ పని రమేషేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బ్యాంకుకు డబ్బు రవాణా చేసే వాహనంలో పరారీ.. ఏపీజీవీబీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల్లో 28 ఏళ్ల లోపు వారిని వచ్చే నెల రెగ్యులరైజ్ చేయనున్నట్లు రమేష్‌కు తెలిసింది. అతడికి సుమారు 40 ఏళ్లు ఉండడంతో తనకు ఉద్యోగం రాదని భావించి నిరాశకు గురయ్యాడు. బ్యాంకుకు కన్నం వేయాలనే దురాశ పుట్టింది. రమేష్ 12 ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తుండడంతో మేనేజర్‌తోపాటు ఉద్యోగులందరు అతడిని నమ్మేవారు. బ్యాంకు తాళాలు అతని చేతిలోకి వచ్చేవి. దీంతో శనివారం రాత్రి దోపిడీకి పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం ఉద్యోగులు వెళ్లిపోయాక ముందస్తుగా బ్యాంకు షెట్టర్ అలారమ్‌ను తొలగించాడు. సీసీ కెమెరా పుటేజీల కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను వెంట తీసుకుపోయాడు. బ్యాంకులో ఉన్న ఆజంనగర్ బ్రాంచి తాళాలను తీసుకుని పై అంతస్తు నుంచి కిందికి వచ్చాడు. కింద ఉన్న బేకరీ షాపులో భూపాలపల్లి బ్రాంచి తాళాలు ఇచ్చి ‘నేను తిరుపతికి వెళ్తున్నా.. తాళాలు ఇక్కడ ఇస్తానని మా సార్లకు చెప్పిన. వారు వచ్చాక తాళాలు ఇవ్వండి’ అని చెప్పి వెళ్లాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి మొదట ఆజంనగర్ బ్రాంచికి చేరుకుని వెంట తెచ్చుకున్న తాళాలతో బ్యాంకులోకి వెళ్లి దోచుకున్నాడు. అక్కడ ఉంచిన భూపాలపల్లి బ్రాంచి అదనపు తాళాలను తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. లాకర్లలోని డబ్బు, బంగారు నగలు తీసుకున్నాడు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను పని చేసే బ్యాంకు కు డబ్బు తీసుకువచ్చే సుమోను హన్మకొండ నుంచి రప్పించుకున్నట్లు తెలిసింది. అదే వాహనంలో కుటుంబంతో శ్రీశైలం వెళ్లి... అక్కడి నుంచి నిజామాబాద్, బాసర వెళ్లాడు. అక్కడ సుమో డ్రైవర్ని తిరిగి పంపాడు. అనంతరం రమేష్ కుటుంబంతో చెన్నైకి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు సుమో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. చోరీకి ముందు రమేష్‌తో ఫోన్లో మాట్లాడిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ‘రమేషే చోరీకి పాల్పడినట్లు ఇప్పుడే చెప్పలేం. అతడి గురించి ఆరా తీయడంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.’ అని ములుగు డీఎస్పీ మురళీధర్ చెప్పారు. -
అటెండర్ చేతిలో ‘స్టీరింగ్’
ముప్పారం(నిడమనూరు): పాఠశాల బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యం చిన్నారుల ప్రాణాలమీదకొచ్చింది.. స్టీరింగ్ అటెండర్‌కు ఇవ్వడం తో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం ముప్పారం గ్రామ శివారులో శుక్రవారం చో టు చేసుకుంది. వివరాలు.. నిడమనూరుకు చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు రోజు మాదిరిగా మండల పరిధిలోని ఆ యా గ్రామాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు బయలుదేరింది. వేంపాడ్, జీ అన్నారం గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని ముప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి గాతులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో అన్నారం, వేంపాడ్ గ్రామాలకు చెందిన విద్యార్థులు చిమట నందకుమార్, చిమట కోటేష్, బింత కావ్యసుధ, వల్లపు అరవింద్‌లకు తీవ్ర, అక్షయ, వేణు, నందిని, మణిదీప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిం చారు. ప్రమాద సమయంలో చిన్నారు లు తీవ్రంగా రోదించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ముప్పా రం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆలంపల్లి వెంకన్నలు నిడమనూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయించి మిర్యాలగూడకు తీసుకెళ్లారు. అటెండర్ బస్సు తోలడంతోనే.. స్కూల్ బస్సును అటెండర్ తోలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు తెలిపారు. బస్ రెండవ ట్రి ప్పుకని వేంపాడ్, అన్నారం గ్రామాలకు చెందిన 21మంది విద్యార్థులను తీసుకుని వస్తుండగా గుంటిపల్లి సమీపంలో డ్రైవర్ మహేష్ పండ్లు తోమడానికి వేపపుల్ల కోసం దిగాడు. ఆ సమయంలో డ్రైవర్ స్థానంలోకి స్కూల్, బస్‌కు అటెం డర్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ వచ్చాడు. అక్కడి నుంచి కదిలిన 10నిమిషాలలోపే ప్రమాదం జరిగింది. ప్రతి రోజు అదే ప్రాంతంలో డ్రైవర్ దిగడం, అటెండర్ రావడం జరుగుతుందని బస్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ వేంపాడ్కు చెందిన కార్తీక్ తెలి పాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్,అటెండర్ పరారయ్యారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు.