కోర్టు అటెండర్‌ నియామకాలు రద్దు | atender posts dismis | Sakshi
Sakshi News home page

కోర్టు అటెండర్‌ నియామకాలు రద్దు

Published Wed, Aug 10 2016 10:54 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM

కమాన్‌చౌరస్తా : జిల్లా కోర్టులో అటెండర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా న్యాయమూర్తి వై. రేణుక తెలిపారు. జిల్లాలో 53 ఉద్యోగాల భర్తీ కోసం 2014 ఆగస్టు 12న ప్రకటన వచ్చింది. 11200 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. అర్హులైన అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేశారు.

కమాన్‌చౌరస్తా : జిల్లా కోర్టులో అటెండర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా న్యాయమూర్తి వై. రేణుక తెలిపారు. జిల్లాలో 53 ఉద్యోగాల భర్తీ కోసం 2014 ఆగస్టు 12న ప్రకటన వచ్చింది. 11200 మందికి పైగా దరఖాస్తు  చేసుకోగా.. అర్హులైన అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 300 మంది అభ్యర్థుల చొప్పున అప్పటి న్యాయమూర్తి బి. నాగమారుతిశర్మ రెండు నెలలపాటు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టుకు పంపించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అటెండర్‌ నియామాకాలను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. తదుపరి నియామకాలు హైకోర్టు ఆదేశానుసారమే ఉంటాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement