
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్‌చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఐదు నెలల క్రితం లైంగిక దాడికి యత్నం..
సర్వర్ సదరు బాలికపై ఐదు నెలల క్రితం కూడా లైంగిక దాడికి యత్నించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో అసభ్యకరంగా ప్రవర్తించినా చిన్నారి భయపడి విషయం తమకు చెప్పలేదని, మళ్లీ అలాగే ప్రవర్తించడంతో శనివారం ఏడ్చుకుంటూ వచ్చి విషయం చెíప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు స్థానికులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
విద్యార్థి సంఘాల ధర్నా
పేదరికంతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే పాఠశాల సిబ్బందే లైంగిక వేధింపులకు పాల్పడడంపై విద్యార్థి సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుడు సర్వర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేసిన అనంతరం పోలీసుల జోక్యంతో విరమించారు.
సర్వర్‌ను విధుల నుంచి తొలగించిన ఎంఈవో
విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన సర్వర్‌ను అటెండర్ విధుల నుంచి తొలగిస్తూ మండల విద్యాధికారి డానియేల్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, బెదిరించినా బాధితులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వర్‌పై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. గోదావరిఖనిటౌన్(రామగుండం): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్‌చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment