Needies
-
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ
హుద్‌హుద్ తుఫాన్ వచ్చి ఎనిమిది నెలలు దాటుతోంది.. ఇంకా వేలాది మందికి సాయం అందని పరిస్థితి . నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సాయం అందని ద్రాక్షగా మారింది. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో వేలాది మందిని జాబితాల నుంచి తొలగించారు. చిరునామాలు దొరికిన వారికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని తలపోసినా శాఖల మధ్య సమన్వయలోపం శాపంగా తయారైంది. - ఇంకా అందని హుద్‌హుద్ సాయం - 40 వేల మంది పేర్లు తొలగింపు - మరో 23వేలమందికి తప్పని నిరీక్షణ సాక్షి విశాఖపట్నం: హుద్‌హుద్ వల్ల నిరుపేదలు, మధ్య తరగతి నిలువనీడ లేక అల్లాడిపోయారు. లక్షలాది ఎకరాల్లో పంటలుదెబ్బతిన రైతులు, జీవనోపాదిలేక మత్స్యకారులు తల్లడిల్లిపోయారు. ఏడేసిలక్షల రూపాయలకు చొప్పున చనిపోయిన 45 మందికి పంపిణీ చేశారు. తుఫాన్ తర్వాత మరో ఎనిమిది మంది మృతి కేసులు నమోదైనా నలుగురు తుఫాన్ వల్ల చనిపోయినట్టుగా నిర్ధారించారు. వారికి పరిహారం ఇంతవరకూ రాలేదు. 1.18 లక్షల మందికి ఇళ్లు దెబ్బతినగా బట్టలు, సామాన్లు, పెట్టీషాపులు కోల్పోయిన మరో 37వేల మందికి రూ.82.44కోట్లు విడుదలైతే 1,18,499 మందికి రూ.64.05 కోట్ల జమ చేశారు. వ్యవసాయ పంటలు దెబ్బతిన్న 1,52,806 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 46.46కోట్లు విడుదలైతే 1,28,271 మందికి మాత్రమే రూ.40.42కోట్ల మేర జమచేసామన్నారు. బాధిత ఉద్యానవన రైతులకు రూ.161.56కోట్లు విడుదల కాగా రూ.101. 29కోట్లు, పాడి రైతులకు రూ.19.22కోట్లు విడుదల కాగా, రూ.15.51 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. వలలు,బోట్లు దెబ్బతిన్న 3993మంది మత్స్యకారులకు రూ.8.07 కోట్లు విడుదల కాగా రూ.3.50కోట్లు పంపిణీ చేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 4.80 లక్షల మంది బాధితులకు 3.70లక్షల మందికి రూ.249.20కోట్ల మేర పంపిణీ చేశారు. పేర్లు, అకౌంట్.. ఆధార్ నెంబర్ల నమోదులో దొర్లిన పొరపాట్ల వల్ల కొంతమందైతే..ఎన్యుమరేషన్ సమయంలో గుర్తించిన లబ్ధిదారులు ఆతర్వాత వేరే చిరునామాలకు మారిపోవడం లేదా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వంటి ఘటనల వల్ల మరికొంతమందికి సాయం అందలేదు . ఈ విధంగా సుమారు లక్షా 3వేల మంది బాధితులకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. జాబితాలో ఉన్న ప్పటికీ ఎవరూ తమకు పరిహారం అందలేదని క్లైయిమ్ చేయని వారు, ఎన్నిసార్లు వెతికినా చిరునామాలుదొరకని వారి పేర్లను గుర్తించి జాబితాల నుంచి తొలగించారు. ఇప్పటి వరకు అన్ని శాఖలు కలిపి సుమారు 43వేల మంది పేర్లను తొలగించారు. వీరిలో గృహ లబ్ధిదారులు 6వేలుండగా,సుమారు 19వేల మంది రైతులు, మరో 15వేలమంది హార్టికల్చర్ రైతులు, ఇతర లబ్దిదారుల మరో మూడువేల మంది వరకు ఉన్నారు. గడిచిన నాలుగునెలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించిన లబ్దిదారులకు దశలవారీగా పంపిణీ చేస్తున్నారు.అకౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డుల్లేక కొంతమంది..వివరాలు సరిపోక అర్హులైన లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటువంటి వారికి చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు 40వేల మంది వరకు ఈ విధంగా పంపిణీచేయగా మరో 23వేలమందికి పంపిణీ చేయాల్సిఉంది. వీరిలో 7766మంది గృహలబ్దిదారులకు రూ.4.50కోట్లు 4,300మందికి రూ.1.10 కోట్లు, 2,200 మందికి రూ.2.50కోట్ల పంపిణీ చేయాల్సి ఉంది. మిగిలిన శాఖలకు సంబంధించి మరో రెండుకోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉందని తెలుస్తోంది. -
ఈ పాస్‌తో రేషన్ దూరం
ఈ-పాస్ నిరుపేదల పాలిట శాపంగా తయారైంది. వీరి ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆహారభద్రత వారికి లేకుండా చేస్తోంది. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈపాస్ ఇక్కట్ల వల్ల 80 శాతం కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరకులు అందించారు. ఈ నెలలో పూర్తిగా ఈ పాస్ ద్వారానే అమలు చేయాలన్న జిల్లా యంత్రాంగం పట్టుదల కారణంగా ఈసారి పాత పద్ధతిలో సరుకులివ్వలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల కార్డు హోల్డర్లకు ఈ నెలలో సరకులకు దూరమయ్యాయి. - జిల్లాలో పదిలక్షల మందికి అందని సరకులు - గగ్గోలు పెడుతున్న పేదలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీ పట్నం మున్సిపాల్టీలతో పాటు పది మండలాల పరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈపాస్ పుణ్యమాని కేవలం 2,09,982 మందికి మాత్రమే గత నెలలో సరకులు పంపిణీ చేయగలిగారు. 6,26,548 కార్డుదారులకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రార్) లోనే పంపిణీ చేశారు. ఆ నెలలో 7,389 కార్డుదారులు సరకులు తీసుకెళ్లలేదని గుర్తిం చారు. కాగా ఈ నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే సరకులివ్వాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. డీలర్లే కావాలని మెషీన్లు పనిచేస్తున్నా పనిచేయడంలేదంటూ పక్కన పెట్టేస్తున్నారంటూ ఒకరిద్దరి డీలర్లపై క్రమశిక్షణ చర్యలకు సైతం తీసుకున్నారు. ఇంతలా ఒత్తిడితీసుకొచ్చినా చివరకు అతికష్టంమ్మీద ఈనెలలో 6,06,444 కార్డుదారులకు మాత్ర మే ఈ-పాస్ ద్వారా సరకులివ్వగలిగారు. 2,56,245 కార్డుదారులకు అసలు సరుకులే ఇవ్వలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల్లో ఈ-పాస్ అమలుచేస్తున్నారు. ఇక్కడ 3,69,934 కార్డుదారుల్లో ద్వారా 2,50,888 కార్డుదారులకు మాత్రమే సరఫరా చేయగలిగారు. మరో 1,19,046 మందికి సరకులివ్వలేదు. ఇక రెండు మున్సిపాల్టీలు, ఏడు మండలాలపరిధిలో 4,92,755 కార్డులుండగా, ఈ పాస్‌ద్వారా 3,55, 556 కార్డుదారులకు మాత్రమే సరకులు పంపిణీ చేయగలిగారు. మరో 1,37,199 కార్డుదారులకు అసలు సరకులు పంపిణీ చేయలేదు. అంటే మొత్తమ్మీద 2,56,245 కార్డుదారులకు సరకుల పంపిణీజరగలేదు.ఒకోకార్డులనలుగురు చొప్పున లెక్కేసుకున్నా 10,24,980 మందికి మే నెలలో సరకులు అందని పరిస్థితి నెలకొంది. ఆహార భద్రత పేరుతో కార్డులోని ఒక్కొక్కరికి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలకు పెంచినా ఈ రెండు నెలల్లో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా పూర్తిస్థాయిలో సరుకులు తీసుకున్న పాపాన పోలేదు. గత నెల 25వ తేదీ వరకు సరకులు పంపిణీ చేసినప్పటికీ ఈ నెలలో 22వ తేదీతోనే పంపిణీని నిలుపుదల చేశారు. జూన్ నెలలో లిప్టింగ్ కోసం డీలర్ల నుంచి ఇండెంట్లు తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఈ నెలలో మిగిలిన కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలాఖరు వరకు సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.