కళాశాలలు రిజిస్టర్‌ చేసుకోవాలి | Colleges have to register | Sakshi
Sakshi News home page

కళాశాలలు రిజిస్టర్‌ చేసుకోవాలి

Published Thu, Jul 28 2016 6:33 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM

Colleges have to register

కడప కోటిరెడ్డి సర్కిల్‌:
సాంఘిక సంక్షేమ శాఖలో ఈ పాస్‌ వెబ్‌సైట్‌లో 2016–17 సంవత్సరానికి కళాశాలలు రిజిస్టరు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 413 ప్రభుత్వ, ప్రయివేటు, డిగ్రీ ఇతర వృత్తి కళాశాలలు ఉన్నాయన్నారు. వాటిలో 299 కళాశాలల వారు రిజిస్టర్‌ చేసుకొన్నారని, ఇంకా 114 కళాశాలలు రిజిస్టర్‌ చేసుకోలేదని వీరంతా ఈ నెల 31వ తేదీ లోపల రిజిస్టర్‌ చేసుకోవాలని ఆమె కోరారు. రిజిస్టర్‌  చేసుకున్న హార్డ్‌ కాపీలను ఆమోదం కోసం ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమశాఖ వారికి సమర్పించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement