విజయవాడలో ఏసీబీ సోదాలు | vijayawada: Acb Searches Social Welfare Joint Director House | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఏసీబీ సోదాలు

Published Wed, Jul 19 2023 2:37 PM | Last Updated on Wed, Jul 19 2023 2:54 PM

vijayawada: Acb Searches Social Welfare Joint Director House - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. బృందావన కాలనీలో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ప్రసాద్‌ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు.

1991లో హైదరాబాద్‌లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా.. ఎస్‌పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఎస్‌ఐ, సీఐగా పదోన్నతి పొందారు. 2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ అండ్‌ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏటీవోగా చేరారు. గతంలో భువనగిరి జిల్లా ఏటీవోగా  ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ (DRDA) కృష్ణా, డివిజనల్ ట్రెజరీ అధికారి విజయవాడ, అనంతరం డిప్యూటేషన్‌పై కృష్ణా, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement