కోదాడ రూరల్/అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సడలింపు సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. దీంతో పాస్ లేని వాహనాలన్నింటినీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌లు లేకుండా వచ్చిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి అనుమతించలేదు. కోదాడ డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఎంవీఐలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులో విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉదయం 6–10 గంటల వరకు లాక్‌డౌన్ మినహాయింపు ఉండటంతో రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ఏపీ నుంచి వందల సంఖ్యలో వాహనాలు తెల్లవారుజామున 4 గంటలకే రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న వాడపల్లి, మట్టపల్లి, పులిచింతల, సాగర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం రాత్రి నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. కోదాడ వైపు ఉన్న రామాపురం చెక్‌పోస్టు నుంచి మాత్రమే అనుమతి ఉండటంతో అక్కడకు వాహనాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఈ–పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనక్కి పంపే క్రమంలో ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. లాక్‌డౌన్ మినహాయింపు సమయం ఉంది కదా తమను ఎందుకు అనుమతించరు.. అంటూ కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పాస్‌లు లేని వాహనాలను అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో వాహనదారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించారు. అప్పటికప్పుడు ఆయా జిల్లాల నుంచి ఈ–పాస్ అనుమతి తీసుకున్న వారిని కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని వాహనాలను పోలీసులు ఆపడంతో ఆదివారం ఉదయం ట్రాఫిక్‌జామ్ అయింది. ఈ–పాస్ ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటిని దారి మళ్లించారు.
Lockdown: నో పాస్.. నో ఎంట్రీ
Published Mon, May 24 2021 2:31 AM | Last Updated on Mon, May 24 2021 9:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment