Border areas of the state
-
Lockdown: నో పాస్.. నో ఎంట్రీ
కోదాడ రూరల్/అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సడలింపు సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. దీంతో పాస్ లేని వాహనాలన్నింటినీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌లు లేకుండా వచ్చిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి అనుమతించలేదు. కోదాడ డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు ఎంవీఐలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులో విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉదయం 6–10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ఏపీ నుంచి వందల సంఖ్యలో వాహనాలు తెల్లవారుజామున 4 గంటలకే రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న వాడపల్లి, మట్టపల్లి, పులిచింతల, సాగర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం రాత్రి నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. కోదాడ వైపు ఉన్న రామాపురం చెక్‌పోస్టు నుంచి మాత్రమే అనుమతి ఉండటంతో అక్కడకు వాహనాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఈ–పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనక్కి పంపే క్రమంలో ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. లాక్డౌన్ మినహాయింపు సమయం ఉంది కదా తమను ఎందుకు అనుమతించరు.. అంటూ కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పాస్‌లు లేని వాహనాలను అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో వాహనదారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించారు. అప్పటికప్పుడు ఆయా జిల్లాల నుంచి ఈ–పాస్ అనుమతి తీసుకున్న వారిని కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని వాహనాలను పోలీసులు ఆపడంతో ఆదివారం ఉదయం ట్రాఫిక్‌జామ్ అయింది. ఈ–పాస్ ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటిని దారి మళ్లించారు. -
రాబడి రెట్టింపు
సాక్షి, ముంబై: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టులవల్ల ప్రభుత్వ రాబడి ఆదాయం రెట్టింపు అయింది. రాష్ట్రానికి ఆనుకుని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోకి, మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు సరుకులను రవాణా చేసే వేలాది ట్రక్కులు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. ఈ ట్రక్కుల ద్వారా నిత్యం వేలాది టన్నుల సరుకు రవాణా అవుతుంది. గతంలో సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక చెక్‌పోస్టులు లేకపోవడంతో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో ఇటీవల 16 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసింది. వీటి ద్వారా కొద్ది రోజుల్లోనే రాబడి రెండింతలైంది. గతంలో సరిహద్దులో ఆధునిక చెక్‌పోస్టులు లేకపోవడంవల్ల ట్రక్కులను సరిగా తనిఖీ చేయడం సాధ్యమయ్యేది కాదు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొక్కుబడిగా తనిఖీ చేసేవారు. సరుకుల బరువును తూకం వేసేందుకు తగిన ధర్మకాంటా లేకపోవడంతో డ్రైవర్లు ప్రైవేటు కాంటాల వద్ద తూకం వేయించి రసీదుతో వచ్చేవారు. తక్కువ బరువు చూపించి రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించేవారు. తత్ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గుండిపడింది. అంతేకాకుండా ట్రక్కుల తనిఖీకి ఎక్కువ సమయం పట్టడంతో చెక్ పోస్టులవద్ద వాహనాల బారులుతీరేవి. దీంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తేది. అయితే ఆధునిక చెక్ పోస్టులతో అక్రమాలకు కళ్లెం పడిందనే విషయం పెరిగిన రాబడి స్పష్టం చేసింది. అదేవిధంగా సామర్థ్యానికి మించి సరుకులు చేరవేస్తున్న వాహనదారులకు కూడా కళ్లెం పడింది. దీంతో వారు నిబంధనల ప్రకారం ట్రక్కుల్లో సరుకును తరలించడం ప్రారంభించారు. ఆధునిక చెక్‌పోస్టులు అందుబాటులోకి రావడంతో నియమాలు ఉల్లంఘించి సరుకులు చేరవేస్తున్న 3,318 ట్రక్కులను పట్టుకున్నారు. ఈ చెక్‌పోస్టులు లేకముందు కేవలం 132 ట్రక్కులు మాత్రమే పట్టుబడ్డాయి. మిగతా ఆరు సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక చెక్ పోస్టులు ప్రారంభిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు.