ఇందూరు, న్యూస్‌లైన్ :
ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన అన్ని వివరాలు తప్పనిసరిగా ఈ-పాస్ ఆన్‌లైన్‌లోనే నమో దు చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ వాణీప్రసాద్ జిల్లా అధికారులకు సూచించా రు. శుక్రవారం వసతి గృహాల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు, విద్యార్థుల ఆధార్ నంబర్ ఎంట్రీ, ఇతర అంశాలపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ నెల నుంచి వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో కనిపిం చాలన్నారు. గ్యాస్ సిలిండర్, కూరగాయాలు, కరెంట్ బిల్లు, ఇతర బిల్లులు ఆన్‌లైన్ నుంచి పొందాల్సి ఉంటుందన్నారు. కాగా విద్యార్థులకు అందజేసిన నోట్‌బుక్స్, బెడ్‌షీట్, యూనిఫాంల వివరాలు, వారి హాజరు శాతాన్ని ఈ-పాస్‌లో నమోదు చేయాలని సూ చించారు. బోగన్ హాజరు శాతాన్ని తొలగించాలని, రోజువారీగా పిల్లల హాజరును జిల్లా అధికారులు వార్డె న్ల నుంచి తెలుసుకోవాలన్నారు.
అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, చదువుకునేందుకు బుక్కులతో లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు ప్రతి వసతి గృహానికి రూ.2వేల చొప్పున నిధులు మంజురు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా ప్రతి విద్యార్థికి స్పోర్ట్స్ దుస్తులు త్వరలోనే అందజేయనున్నట్లు వెల్లడించారు. ఉపకార వేతనాలు పొందటానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని, నంబరును ఆన్‌లైన్‌లో ఫీడింగ్ చే యించడంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని అభినందించారు. అదేవిధంగా కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులులేక సీట్లు ఖాళీగా ఉన్నాయని వా టిని త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వంద శాతం పిల్లలుండాలని అధికారులను అదేశించా రు.
ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి విమలాదేవి మాట్లాడుతూ జిల్లాలోని అందరు వార్డెన్లకు ఈ-పాస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో వసతిగృహాల పూర్తి వివరాల నమోదుపై శిక్షణ ఇస్తున్నట్లు కమిషనర్‌కు తె లిపారు. అలాగే విద్యార్థుల హాజరుశాతాన్ని ఆన్‌లైన్ లో నమోదు చేశామని, ఆధార్ ఫిడింగ్‌కు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏబీసీడబ్ల్యూఓ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ రమేశ్, జూనియర్ అసిస్టెంట్ రేవంత్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే వసతిగృహాల వివరాలు
Published Sat, Sep 28 2013 4:55 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement
Advertisement