
సాక్షి, అమరావతి : ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఈపాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అంబులెన్స్‌లు, వైద్య చికిత్సలకు అనుమతినిస్తున్నారు. అత్యవసర ఎంట్రీకి పోలీస్ సిటిజన్ సర్వీసెస్ యాప్‌కి అప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.