ఈయేడాది నుంచే రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ....
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత విద్యామండలి టెక్నికల్ కార్యదర్శి ఆదేశం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది నుంచే రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సునీతాధావారా ఆదేశించారు. సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో రాయలసీమ యూనివర్సిటీ వీసీ నరసింహులు, ఇతర అధికారులతో మాట్లాడారు. ఫీజురీయింబర్స్‌మెంట్ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసి ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.