సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ప్రయోగాత్మక పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను అమ లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ శాఖల పరిధిలో 1,345 సంక్షేమ వసతిగృహాలున్నాయి.
వీటి పరిధిలో 2.25 లక్షలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నా రు. అయితే విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపు తూ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకువస్తోంది.
వారంలోగా క్షేత్రస్థాయి అవసరాలపై అంచనా
హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలు కోసం బయోమెట్రిక్ మెషీన్లు అవసరం. వీటిని ఆధార్ నంబర్ ఆధారంగా వేలిముద్రలు తీసుకునేలా తయారు చేశారు. ప్రతి హాస్టల్‌లో మెషీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెషీన్లను పరిశీలించి పనితీరును అంచనా వేయాలని, అవసరమైనచోట కొత్తవి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసులు(టీఎస్‌టీఎస్) విభాగానికి ఇవ్వాలని నిర్ణయించి లేఖ రాసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment