సత్తెనపల్లి : వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులోభాగంగా వసతి గృహాల సంక్షేమాధికారులకు బయోమెట్రిక్ యంత్రాలు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల వేలిముద్రలు, ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు.
ఇదీ సంగతి.. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉంటున్నప్పటికీ ఎక్కువమంది ఉన్నట్లు చూపిస్తూ పలువురు సంక్షేమాధికారులు ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ దందాలో కొందరు అధికారులకూ భాగస్వామ్యం ఉంటోంది. వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు, జిల్లా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాల గుట్టు రట్టరుున సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తోంది.
ఇదీ జరిగేది...
* వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల హాజరును ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లో బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా రాజధానిలోని సీజీజీకి వెళతారుు. దీంతో ఏ రోజు ఎంతమంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నారో తెలిసిపోతుంది.
* విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపేందుకు తప్పుడు వేలిముద్రలు వేసే అవకాశం ఉన్నందున ఆధార్ నంబర్లను అనుసంధానం చేస్తారు. బయోమోట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకుకు వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం సమకూరుస్తారు.
* జిల్లాలోని 94 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ల్యాప్ టాప్‌ల్లో నిక్షిప్తం చేసిన ప్రత్యేక సాప్ట్‌వేర్ ఆధారంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, ఏ పాఠశాలల్లో చదువుతున్నారనే వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పటికే వసతి గృహాల్లోని విద్యార్థుల ఆధార్ నంబర్లను సేకరించారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం అమలుపై సంక్షేమ అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది..
బయోమెట్రిక్ విధానం అమలుతో వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లోనే వేలిముద్రల సేకరణ ఉంటుంది. అనంతరం వేలిముద్రలు వేయాలన్నా యంత్రం తీసుకోదు. ఈ సమాచారం ఆధారంగానే వసతి గృహాలకు సరుకులు, నగదు అందుతారుు. ఈ విధానంపై సంక్షేమ అధికారులకు త్వరలోనే శిక్షణ ఇస్తాం.
- ఆర్.అన్నపూర్ణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి
అక్రమాలకు చెక్ !
Published Tue, Sep 9 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement