రచ్చబండ! | Telangana plaintiffs demanded to remove CM photos on flexi | Sakshi
Sakshi News home page

రచ్చబండ!

Published Thu, Nov 21 2013 4:43 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Telangana plaintiffs demanded to remove CM photos on flexi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:  ఈసారి రచ్చబండ సభలను మండల కేంద్రాలు, పట్టణాలకే పరిమితం చేశారు. షెడ్యూలు ప్రకారం ఇప్పటివరకు 43కుపైగా సభలు పూర్తికావాల్సి ఉండగా ప్రజల నుంచి ఏర్పడుతున్న ఆటంకాల కారణంగా 12 సభలనే నిర్వహించారు. బోధన్ నియోజకవర్గంలో రచ్చబండ పూర్తికాగా, ఎల్లారెడ్డిలో మూడు, బాల్కొండలో ఒకటి, ఆర్మూర్‌లో మూడు సభలను నిర్వహిం చారు. ఆర్మూర్ నియోజకవర ్గంలోని ఆర్మూర్ పట్టణం, నంది పేట, మక్లూర్‌లో బుధవారం రచ్చబండ సభలు జరిగాయి. ఈ సభ ల్లో ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, స్థానిక ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.
  రచ్చబండ వేదికపై అలంకరించిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండడంపై ఆర్మూర్ సభలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీఎం సందేశాన్ని కూడా సభలో చదవనివ్వకుండా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ ఫొటోలుగానీ, సందేశం కాని ఉండకూడదని హెచ్చరించారు. ఈ సభలో సీపీఎం కార్యకర్తలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో నిర్బంధించారు.
 నందిపేట, మాక్లూర్‌లో మాత్రం రచ్చబండ సభలు సజావుగా సాగాయి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని సార్వత్రిక ఎన్నికలకు  ముందు నిర్వహిస్తోందనివిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
  గత రచ్చబండ సభల్లో అర్హులైన లబ్ధిదారులు వివిధ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి ప్రభుత్వం పరి ష్కారం చూపలేదని పేర్కొంటున్నాయి. మూడో విడత సభలలో గతంలోని దరఖాస్తులకు మంజూరు ఇవ్వడంతో పా టు, కొత్త దరఖాస్తులను స్వీకరించాలని సీపీ  ఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సభలలో సీఎం సందేశాన్ని చదవనివ్వబోమని, వేదికపై ఫ్లెక్సీలో సీఎం ఫొటోను ఉంచనివ్వబోమని టీఆర్‌ఎస్, బీజేపీ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఈ విషయంపై ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. పక్కనున్న కరీంనగర్ జిల్లా లో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చబండలో సీఎం ఫొటోతో పాటు సందేశం లేకుండా చర్యలు చేపడుతుండగా జిల్లాలో ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పందించకపోవడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement