telangana Plaintiffs
-
రచ్చబండ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈసారి రచ్చబండ సభలను మండల కేంద్రాలు, పట్టణాలకే పరిమితం చేశారు. షెడ్యూలు ప్రకారం ఇప్పటివరకు 43కుపైగా సభలు పూర్తికావాల్సి ఉండగా ప్రజల నుంచి ఏర్పడుతున్న ఆటంకాల కారణంగా 12 సభలనే నిర్వహించారు. బోధన్ నియోజకవర్గంలో రచ్చబండ పూర్తికాగా, ఎల్లారెడ్డిలో మూడు, బాల్కొండలో ఒకటి, ఆర్మూర్‌లో మూడు సభలను నిర్వహిం చారు. ఆర్మూర్ నియోజకవర ్గంలోని ఆర్మూర్ పట్టణం, నంది పేట, మక్లూర్లో బుధవారం రచ్చబండ సభలు జరిగాయి. ఈ సభ ల్లో ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, స్థానిక ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. రచ్చబండ వేదికపై అలంకరించిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండడంపై ఆర్మూర్ సభలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీఎం సందేశాన్ని కూడా సభలో చదవనివ్వకుండా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ ఫొటోలుగానీ, సందేశం కాని ఉండకూడదని హెచ్చరించారు. ఈ సభలో సీపీఎం కార్యకర్తలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించారు. నందిపేట, మాక్లూర్‌లో మాత్రం రచ్చబండ సభలు సజావుగా సాగాయి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తోందనివిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రచ్చబండ సభల్లో అర్హులైన లబ్ధిదారులు వివిధ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి ప్రభుత్వం పరి ష్కారం చూపలేదని పేర్కొంటున్నాయి. మూడో విడత సభలలో గతంలోని దరఖాస్తులకు మంజూరు ఇవ్వడంతో పా టు, కొత్త దరఖాస్తులను స్వీకరించాలని సీపీ ఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సభలలో సీఎం సందేశాన్ని చదవనివ్వబోమని, వేదికపై ఫ్లెక్సీలో సీఎం ఫొటోను ఉంచనివ్వబోమని టీఆర్ఎస్, బీజేపీ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఈ విషయంపై ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. పక్కనున్న కరీంనగర్ జిల్లా లో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చబండలో సీఎం ఫొటోతో పాటు సందేశం లేకుండా చర్యలు చేపడుతుండగా జిల్లాలో ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పందించకపోవడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. -
ఫ్లెక్సీపై సీఎం ఫొటో తొలగింపు
మందమర్రి రూర ల్/ నిర్మల్ (మామడ ), న్యూస్‌లైన్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన 3వ విడత రచ్చబండకు తెలంగాణ సెగ తగిలింది. కార్యక్రమ ప్రారంభానికి ముందే చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రమేశ్, కార్యదర్శి నూకల రమేశ్, నాయకులు సంగి సదానందం వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం కిరణ్‌కుమార్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీని తొలంగించారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త వేదికపైనున్న ఫ్లెక్సీని ఎవ్వరికి అందకుండా పట్టుకొని పరుగులు తీశాడు. చివరకు పోలీసులు ఆయన్ని వెంబడించి బ్యానర్‌ను వేదిక వద్దకు తీసుకువచ్చారు. దీంతో గొడవ ముదరడంతో ఫ్లెక్సీని చుట్ట చుట్టి పక్కన పెట్టారు. ఫ్లెక్సీలో ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ ఫొటో ఉండాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం బొమ్మ ఉన్న బ్యానర్‌ను తొలగించి వారు ప్రత్యేకంగా తయారు చేయించిన రచ్చబండ బ్యానర్‌ను వేదికపై తగిలించారు. తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఈ ప్రాంతంలో కనిపించవద్దని గుడ్ల రమేశ్ పేర్కొన్నారు. మామడలోనూ సీఎం ఫొటో తొలగింపు.. మామడలో బుధవారం నిర్వహించిన రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండడంతో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దానిని తొలగించాలని సూచించారు. దీంతో అక్కడున్న వారు ఫ్లెక్సీ తొలగించి, జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని పెట్టారు. -
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు
మేడ్చల్, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఆయన వ్యవహారశైలిపై నిరసన వ్యక్తమవుతోంది. ఇందుకు రచ్చబండ కార్యక్రమం వేదికవుతోంది. మేడ్చల్‌లో బుధవారం రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో రభసకు దారితీ సింది. వేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో పాటు ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేఎల్లార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడటానికి ఉపక్రమిస్తుండగా తెలంగాణవాదులు గొడవ ప్రారంభించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీశ్యాంరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు టీడీపీకి చెందిన సర్పంచ్‌లు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను చించేందుకు ప్రయత్నించా రు. సీఐ రాంరెడ్డి వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకునిఅదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు సత్యనారాయణ సభా ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని సభనుంచి బయటకు పంపించివేశారు. ఇంతలోనే టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణుచారి, నాయకుడు రవీందర్‌తో తదితరులు వేదిక వెనుకవైపు నుంచి వచ్చి ఫ్లెక్సీని లాగేశారు. దీంతో పోలీసులు వారినుంచి ఫ్లెక్సీని తీసుకునేందుకు యత్నించగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని తీసుకొని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో కన్పించకుండా ఓ పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా మళ్లీ గొడవ జరుగుతుందేమోననే అనుమానంతో పోలీసులు రచ్చబండ ఫ్లెక్సీకి కార్యక్రమం పూర్తయ్యే వరకూ బందోబస్తుగా నిలిచారు.