ప్రతిష్టాత్మక పోరు
* సిట్టింగ్ ఎంపీకి గట్టిపోటీ
* స్పీడ్ పెరిగిన కారు... పట్టు బిగిస్తున్న కమలం
* ఆసక్తికరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక
నిజామాబాద్ నుంచి బి. నారాయణరెడ్డి: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు దఫాలుగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ (కాంగ్రెస్) మధుయూష్కీ గౌడ్ ఎదురీదుతున్నారు. ఇటు కమలం...అటు కారు నుంచి గట్టి పోటీ ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తవువుతోంది. ఎంపీగా గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వివుర్శలున్నారుు. బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పోటీచేయుకపోవడం కూడా మధుయూష్కీకి పరిస్థితులు ప్రతికూలంగానే వూరాయునే చెప్పవచ్చు. టీడీపీలో కింది స్థారుు క్యాడర్ చాలా వరకు టీఆర్‌ఎస్ పట్ల ఆసక్తిచూపుతోంది. నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పరిస్థితి గడ్డుగానే ఉంది. ఇక్కడి అభ్యర్థులతో సవున్వయులోపం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్ భయుం ఆయునను వెన్నాడుతోంది.
కవిత రాకతో వూరిన సమీకరణాలు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత లోక్‌సభ బరిలోకి దిగడంతో ఇక్కడి రాజకీయు పరిణాలు అనూహ్యంగా వూరిపోయూరుు. పైగా కూతురి గెలుపు కోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రజల్లో పట్టున్న బాజిరెడ్డి గోవర్దన్ వంటి నాయకుల్ని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని లోక్‌సభ సీటు పరిధిలోని అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపడం ద్వారా ప్రత్యర్థుల స్పీడ్ తగ్గించగలిగారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడం, తెలంగాణ జాగృతి సంస్థ పేరిట తెలంగాణ సంస్కృతి- సంప్రదాయూలను జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా కవిత వుహిళలకు దగ్గరవ్వడం ఎన్నికల్లో కలిసివచ్చే అంశం.
బలంగా ఉన్న బీజేపీ
బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ గట్టిపోటీ ఇస్తున్నారు. పైగా, నిజామాబాద్ పట్టణంలో బీజేపీకి బాగా పట్టు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అందరితో ఉన్న వుంచి సంబంధాలు ఆయునకు ఓట్ల రూపంలో కలిసివచ్చే అవకాశాలు ఉన్నారుు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీలో ఉన్న సూర్యనారాయణ గుప్తా బలమైన అభ్యర్థి. ఇతర అసెంబ్లీ సెగ్మెంట్ల లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ పుంజుకునే స్థారుుని బట్టి అభ్యర్థుల గెలుపు ఓటవుులు ఉంటారుు.