Nizamabad Lok Sabha elections
-
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం -
టీఆర్ఎస్కు భారీ షాక్.. కవిత ఓటమి
హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఫుల్‌జోష్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అంటూ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆ పార్టీకి ఊహించనిరీతిలో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలైన కవిత నిజామాబాద్ స్థానంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 68 వేలపై చీలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు. ఇక, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బీ. వినోద్‌కుమార్ కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. ఉద్యమకాలంలో ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ రికార్డు మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్లో ఓటమి కూడా టీఆర్ఎస్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గోడెం నగేశ్‌పై భారీ మెజారిటీతో లీడింగ్‌లో ఉన్నారు. ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ.. బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందడం గమనార్హం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లాంటి టీఆర్ఎస్ కంచుకోటలను బద్దలు కొట్టడమే కాదు.. సికింద్రాబాద్‌లో సైతం బీజేపీ గెలుపుదిశగా సాగుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కిషన్‌రెడ్డి 30వేల పైచిలుకు ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌పై ఆధిక్యంలో ఉన్నారు. ఇదేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏకంగా తెలంగాణలో నాలుగు స్థానాలు కైవసం చేసుకునే దిశగా సాగుతుండటం గమనార్హం. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించగా.. చెవేళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. -
పోలింగ్ శాతం ఎలా పెరిగింది?
జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గంటలోపే 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్లో ఈవీఎంను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజునే ఈవీఎంలను తరలించాల్సింది పోయి 15వ తేదీ రాత్రి తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగిత్యాల, నిజామాబాద్ కలెక్టర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ ఓడిపోలేదని వ్యాఖ్యా నించారు. లక్ష్మణ్‌కుమార్ ఓడిపోవడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాగొంతుకైన కలానికి సంకెళ్లా?’ అనే పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు వినతిపత్రాలు అందించారు. -
నిజామాబాద్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ ఎన్నకలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో నిజామాబాద్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తొలగింది. తదుపరి విచారణ న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పోలింగ్‌ను వాయిదా వేయాలని, పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచిన 16మంది రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, ప్రధాన పార్టీల అభ్యర్థులు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, తమకు ప్రచారం నిర్వహించుకునేందుకు సమయం లేకుండా పోయిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిజామాబాద్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిజామాబాద్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో 185మంది అభ్యర్థులు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు పెద్దసంఖ్యలో పోటీ చేయడంతో ఎం-3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీఎంల చెకింగ్, ర్యాండమైజేషన్ పూర్తి చేసిన ఎన్నికల అధికారులు...వాటిని ఆదివారమే అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించారు. అయితే అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడమే అధికారులకు సవాల్‌గా మారింది. గత ఎన్నికల వేళ 200 వాహనాల్లో పోలింగ్ సామాగ్రిని తరలించగా, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. -
నిజామాబాద్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి : ఈసీ
సాక్షి, నిజామాబాద్ : తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీకి దిగారని తెలిపారు. ఇంతమందికి ఈవీఎంలో ఎన్నికలు నిర్వహించడం చాలెంజింగ్ టాస్క్ అని పేర్కొన్నారు. అయినా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఈవీఎంల పరిశీలనలో 600 మంది ఇంజినీర్ల సహాయం తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి చేశామని.. 100 మంది అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించామన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 4 వేల ఈవీఎంల పరిశీలన పూర్తయ్యిందని.. ఈనెల 7లోగా చెకింగ్ ప్రక్రియ పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఈవీఎంలను పంపుతామన్నారు. -
‘నామినేషన్ పత్రాలు ఉంటేనే కేసు పరిశీలిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వాయిదాపై 16 మంది రైతులు వేసిన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ పత్రాలు ఉంటేనే విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దాంతో నామినేషన్ పత్రాలు సకాలంలో అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. నామినేషన్ పత్రాల సమర్పణకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అంతేకాక ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతి స్వతంత్ర అభ్యర్థికి గుర్తును కేటాయించాలని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
ఎన్నికలు వాయిదా వేయరాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఏర్పాట్ల పేరుతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదని కాంగ్రెస్ కోరింది. షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు సోమవారం టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్.నిరంజన్ లేఖ రాశారు. వీవీప్యాట్ రశీదులను ఏడు సెకన్ల పాటే ప్రదర్శిస్తుండడంతో ఓటు ఎవరికి పడిందో గుర్తించడానికి ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీవీప్యాట్ల రశీదులను 30 సెకన్లపాటు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న 185 మంది అభ్యర్థుల్లో తమకు కావాల్సిన అభ్యర్థిని 12 బ్యాలెట్ యూనిట్లలో వెతికి గుర్తించడానికి సమయం పట్టనుందని, దీంతో పోలింగ్ వేళలను పెంచాలని కోరారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తే సమయం సరిపడదని అన్నారు. -
ప్రతిష్టాత్మక పోరు
* సిట్టింగ్ ఎంపీకి గట్టిపోటీ * స్పీడ్ పెరిగిన కారు... పట్టు బిగిస్తున్న కమలం * ఆసక్తికరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక నిజామాబాద్ నుంచి బి. నారాయణరెడ్డి: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు దఫాలుగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ (కాంగ్రెస్) మధుయూష్కీ గౌడ్ ఎదురీదుతున్నారు. ఇటు కమలం...అటు కారు నుంచి గట్టి పోటీ ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తవువుతోంది. ఎంపీగా గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వివుర్శలున్నారుు. బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పోటీచేయుకపోవడం కూడా మధుయూష్కీకి పరిస్థితులు ప్రతికూలంగానే వూరాయునే చెప్పవచ్చు. టీడీపీలో కింది స్థారుు క్యాడర్ చాలా వరకు టీఆర్ఎస్ పట్ల ఆసక్తిచూపుతోంది. నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పరిస్థితి గడ్డుగానే ఉంది. ఇక్కడి అభ్యర్థులతో సవున్వయులోపం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్ భయుం ఆయునను వెన్నాడుతోంది. కవిత రాకతో వూరిన సమీకరణాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత లోక్‌సభ బరిలోకి దిగడంతో ఇక్కడి రాజకీయు పరిణాలు అనూహ్యంగా వూరిపోయూరుు. పైగా కూతురి గెలుపు కోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రజల్లో పట్టున్న బాజిరెడ్డి గోవర్దన్ వంటి నాయకుల్ని టీఆర్ఎస్లో చేర్చుకుని లోక్‌సభ సీటు పరిధిలోని అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపడం ద్వారా ప్రత్యర్థుల స్పీడ్ తగ్గించగలిగారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడం, తెలంగాణ జాగృతి సంస్థ పేరిట తెలంగాణ సంస్కృతి- సంప్రదాయూలను జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా కవిత వుహిళలకు దగ్గరవ్వడం ఎన్నికల్లో కలిసివచ్చే అంశం. బలంగా ఉన్న బీజేపీ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ గట్టిపోటీ ఇస్తున్నారు. పైగా, నిజామాబాద్ పట్టణంలో బీజేపీకి బాగా పట్టు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అందరితో ఉన్న వుంచి సంబంధాలు ఆయునకు ఓట్ల రూపంలో కలిసివచ్చే అవకాశాలు ఉన్నారుు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీలో ఉన్న సూర్యనారాయణ గుప్తా బలమైన అభ్యర్థి. ఇతర అసెంబ్లీ సెగ్మెంట్ల లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ పుంజుకునే స్థారుుని బట్టి అభ్యర్థుల గెలుపు ఓటవుులు ఉంటారుు.