సాక్షి, నిజామాబాద్ : తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీకి దిగారని తెలిపారు. ఇంతమందికి ఈవీఎంలో ఎన్నికలు నిర్వహించడం చాలెంజింగ్ టాస్క్ అని పేర్కొన్నారు. అయినా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఈవీఎంల పరిశీలనలో 600 మంది ఇంజినీర్ల సహాయం తీసుకుంటున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి చేశామని.. 100 మంది అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించామన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 4 వేల ఈవీఎంల పరిశీలన పూర్తయ్యిందని.. ఈనెల 7లోగా చెకింగ్ ప్రక్రియ పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఈవీఎంలను పంపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment