ఫ్యాన్ గాలి వీస్తోంది
- ప్రచారంలో వైఎస్‌ఆర్ సీపీ ముందంజ
- రాజన్న పథకాలను వివరిస్తూ
- మేనిఫెస్టోపై అవగాహన కల్పిస్తూ
- ముందుకు సాగుతున్న అభ్యర్థులు
- ప్రజల నుంచి అనూహ్య స్పందన
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు పల్లెలు, పట్టణాలలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడపగడప కూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందినవారు అభ్యర్థులను అక్కున చేర్చుకుంటున్నారు.
రాజన్న పథకాలను వివరిస్తూ, తమను గెలిపిస్తే తిరిగి సువర్ణ పాలన అందిస్తామని అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఎనిమిది అ సెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థు ల ప్రచారం ఊపుమీద ఉంది.
లోక్‌సభ అభ్యర్థులు
నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు సంగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మహమూద్ మొహియొద్దీన్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ఇటీవల బోధన్‌లోని కాజాపురంలో ప్రచారం నిర్వహించారు. బీడీ కార్మికులు, గృహిణులు ప్రచారంలో పాల్గొని ఆయనకు మద్దతు పలికారు. బాల్కొండ, నిజామాబాద్, ఆర్మూర్ నియోజక వర్గా ల్లో రవీందర్‌రెడ్డి 15 రోజులుగా విరామం లేకుండా ప్రచారం చేశారు.
ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకు హామీ ఇస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మొహియొద్దీన్ కామారెడ్డి,ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వృద్ధులు, యువతులు, గృహిణులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, నీటి కొరత నివారణ , వైద్యసదుపాయాలపై తాము చేసే కృషిని వివరిస్తున్నారు.
అసెంబ్లీ అభ్యర్థులు
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నిజామాబాద్ అర్బన్‌లో అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.
నగరంలోని 36, 37, 17, 25 డివిజన్లలో మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున శ్రీధ ర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, మైనారిటీలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ శ్రీధర్‌రెడ్డి ప్రచారంలో ముందుం టున్నారు. ప్రతి రోజు డివిజన్లలో తిరుగుతున్నారు. నగరంలో ప్రధాన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తున్నారు.
ఎల్లారెడ్డిలో
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సిద్ధార్థరెడ్డి వేగంగా ప్రచారంలో ముందున్నారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి పొలాలలో పనిచేసే కూలీల వద్దకు వెళ్లి కలువగా వారు సానుకూలంగా స్పందించి మద్దతు ప్రకటించారు. మార్కెట్‌లోని వ్యాపారులను కలుస్తూ వైఎస్‌ఆర్ సీపీని గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామం లో పర్యటిస్తూ వైఎస్‌ఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అలాంటి పాలన మళ్లీ రావాలంటే వైఎస్సార్‌సీపీనే గెలిపించాలని కోరుతున్నారు.
జుక్కల్‌లో
జుక్కల్ నియోజకవర్గంలో నాయుడు ప్రకాశ్ వ్యాపారులను కలిసి వారి మద్దతు కోరారు. హోటళ్లలోని కార్మికులతో కలిసి వారిలో పనిలో మమేకమయ్యారు. మద్నూరు, జుక్కల్ , బిచ్కుందలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన యువకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. నియోజకవర్గంలోని మిగతా పార్టీల అభ్యర్థుల కంటే నాయుడు ప్రకాశ్ ప్రచారంలో ముందున్నారు.
బోధన్‌లో
బోధన్ నియోజక వర్గంలో సుదీప్‌రెడ్డి ప్రచారం జోరుగా చేస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డితో కలిసి ఆయా గ్రామాల్లో, మండలాల కేంద్రాలలో ప్రచారం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీని గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుని కార్మికులకు, రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
బాన్సువాడలో
బాన్సువాడ నియోజకవర్గంలో శోభన మహేందర్‌రెడ్డి విస్తృతం గా ప్రచారం చేస్తున్నారు. గ్రామాలలో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని ఓటర్లను కోరుతున్నారు. తమ పార్టీ మాత్రమే మహిళకు అవకాశం ఇచ్చిందని, తనను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కామారెడ్డిలో
కామారెడ్డిలోని వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజ లకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. గ్రా మ గ్రామాన తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్‌లో
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో బొడ్డు గంగారెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ ఆర్‌సీపీకి ఓటువేయాలని కోరుతున్నారు.
బాల్కొండలో
బాల్కొండ నియోజక వర్గంలో పాలెపు మురళి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్తూ వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వే యాలని కోరుతున్నారు. ఓటర్ల నుంచి స్పందన రావడంతో ఆయన మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.