assembly candidates
-
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు. -
పేర్లు చూసి టిక్కు పెట్టాలా?..నామ్ కే వాస్తే లిస్ట్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోతపై మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాడీవేడిగా జరిగింది. సీనియర్ నేతలు కొందరు పలు అంశాలపై సందేహాల పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన ఆశావహుల జాబితాలో పేర్లు తప్ప ఎలాంటి సమాచారం లేకపోవడంపై జానారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలేవీ లేకుండా కేవలం జాబితా ఇచ్చేసి టిక్కులు పెట్టమంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ టికెట్ల అంశంపై సీనియర్ నేతల మధ్య వాగి్వవాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీఈసీ వడపోత కార్యక్రమాన్ని సెపె్టంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాం«దీభవన్‌లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలరాం నాయక్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సునీతారావ్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావు, మిద్దెల జితేందర్లు పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారులో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి, ఇతర పారీ్టలతో పొత్తులు తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు. పేర్లిస్తే సరిపోతుందా? విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులందరికీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున టిక్ చేయాలని కోరారు. అయితే జాబితాలో కేవలం పేర్లు మాత్రమే ఉండటంపై జీవన్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నాల తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు? అనే వివరాలు కూడా లేకుండా అభ్యర్థులను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఆశావహుల సీనియార్టీ, పారీ్టలో హోదా, పూర్వ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవ, కులం లాంటి వివరాలేవీ లేకుండా కేవలం పేర్లు చూసి టిక్ పెట్టాలంటే ఎలా పెడతామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి, పొన్నాల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల విశ్లేషణ లేకుండా, ఏ ప్రాతిపదికన ఏ కులానికి టికెట్లు ఎన్ని ఇవ్వాలో నిర్ధారించకుండా, ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల ఓటర్లను అంచనా వేయకుండా టిక్కులు చేయడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నించారు. ఆశావహుల పూర్తి వివరాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సామాజిక వివరాలు ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర సర్వే వివరాలను కానీ, ఇప్పటికే ఏఐసీసీకి పంపిన వివరాలను కానీ జత చేయాలని పొన్నాల సూచించారు. యూత్‌కు ఎన్ని టికెట్లు? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చే టికెట్లను తొలి జాబితాలోనే ప్రకటించాలని అన్నారు. నియోజకవర్గాల్లో పని చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, ఎన్నికల్లో అన్ని విధాలా వారికి సాయం చేయాలని సూచించారు. యువకులకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే పక్షంలో తన కుమారుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేస్తున్నందున తనతో పాటు తన కుమారుడికి అవకాశం కలి్పంచాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కోరారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని వీహెచ్, మహిళలకు తగిన అవకాశాలు కలి్పంచాలని రేణుకా చౌదరి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని, సెప్టెంబర్ 2న మరోమారు సమావేశమై అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించి వడపోత చేపట్టాలని పీఈసీ నిర్ణయించింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలనే అంశాలపై వచ్చే నెల 2న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని పీఈసీ నిర్ణయించింది. బీఆర్ఎస్కు కౌంటర్ వ్యూహం ఉండాలి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిపోయిందని, దళిత బంధు లాంటి పథకాల ద్వారా కొత్తగా నియోజకవర్గానికి మరో 10 వేల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటోందని, ఈ ఓటు బ్యాంకును కౌంటర్ చేసేలా పార్టీ వ్యూహం ఉండాలని, వీలున్నంత త్వరగా అభ్యర్థుల వడపోత ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పినట్లు సమాచారం. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తొలి జాబితా: మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశానంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్టు చెప్పారు. దరఖాçస్తుదారుల అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించేందుకు సెపె్టంబర్ 2న పీఈసీ మరోమారు సమావేశమవుతుందని తెలిపారు. 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని స్థాయిల్లోని నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని చెప్పారు. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారి పేర్లు ఉండాలని పీఈసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పొత్తు పొరపాట్లు చేయొద్దు ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్‌తో పాటు ఇతర పారీ్టలతో పొత్తుల అంశంపై కూడా పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ‘గతంలో లాగా ఒక పార్టీ నుంచి ఇంకో పారీ్టకి ఓట్ల బదిలీ జరగడం లేదు. మనం పొత్తుల పేరుతో వెళ్లి సీట్లు త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అని వారు చెప్పినట్టు తెలిసింది. 60 చోట్ల భారీగా దరఖాస్తులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిస్తే.. 60 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 45 నియోజకవర్గాల్లో 10 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 5 నియోజకవర్గాల్లో 9 చొప్పున, 10 నియోజకవర్గాల్లో 8 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, జగిత్యాలలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా, మిగిలిన చోట్ల 2 నుంచి 7 వరకు వచ్చాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 32 దరఖాస్తులు రావడం గమనార్హం. -
నెట్లో అభ్యర్థుల నేరచరిత!
న్యూఢిల్లీ: చట్టసభల్లో నేరచరితుల సంఖ్య పెరిగిపోతూండటంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో వివరణ ఇవ్వడంతోపాటు ఆయా కేసుల జాబితాను రాజకీయ పక్షాలన్నీ తమ వెబ్సైట్లలో ఉంచాలని స్పష్టంచేసింది. ఎన్నికల్లో విజయం సాధించగలరన్న ఒకే ఒక్క కారణంతో నేర చరితులకు టిక్కెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పజాలవని, వారి అర్హతలు, సమర్థత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తగిన కారణాలు చూపాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయాలు నేరపూరితం కావడంపైకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా తెలపాలని, అభ్యర్థులను ఎంపిక చేసిన మూడు రోజు(72 గంటలు) ల్లోగా ఈ పని పూర్తి చేయాలని వివరించింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఆ వివరాలను తమకు ఇవ్వాలని ఈసీకి చెప్పింది. నేర చరితులు పెరుగుతున్నారు గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే చట్టసభల్లో నేరచరితులు ఎక్కువవుతున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. నేరచరితులను పోటీలో నిలిపిన పార్టీలకు లేదా అభ్యర్థులకు జరిమానా విధించాలన్న అంశంపై కొంత జాగరూకత అవసరమని, రాజకీయ కారణాలతో అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటం ఇందుకు కారణమని కోర్టు వివరించింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక ఏకగ్రీవ తీర్పునిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి వెల్లడించాలని, ఆ వివరాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రచారం కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలు నేరపూరితం కావడమన్న రోగానికి పార్లమెంటు తగిన చికిత్స చేయాలని, నేర చరితులు చట్టసభల్లో ప్రవేశించకుండా చట్టాలు చేయాలని, కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని తన ఆదేశాల్లో పేర్కొంది. నేర చరితులకు టికెట్లిస్తే అందుకు వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రధాని మోదీ ఉల్లంఘించారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం: బీజేపీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్రను ఆన్లైన్లో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్య ద్వారా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఎంపీల్లో 40 శాతం మందిపై కేసులు: ఈసీ పార్లమెంట్‌లోని కనీసం 43 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా నేరచరితుల వివరాలను, వారి ఎంపికకు కారణాలను, క్రిమినల్ కేసులు లేని వారిని ఎందుకు ఎంపిక చేయలేదో తమతమ వెబ్సైట్లలో పార్టీలు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలన్న బీజేపీ నేత, పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సూచనను ఈసీ అంగీకరించింది. ఈ మేరకు 2018 అక్టోబరు 10వ తేదీన ఫార్మ్ –26లో కొన్ని మార్పులు చేస్తూ నేర చరిత్ర వివరాలను అందించాల్సిందిగా రాజకీయ పార్టీలకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో ఎలక్షన్ సింబల్ ఆర్డర్–1968లోగానీ, ఎన్నికల నిబంధనావళిలోగానీ తగు మార్పులు చేయకపోవడం వల్ల 2018 అక్టోబర్ నాటి నోటిఫికేషన్‌కు న్యాయబద్ధత లేకుండా పోయిందన్న అశ్వినీకుమార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. -
హోరెత్తుతున్న సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది. అభ్యర్థుల ఆరోపణ, ప్రత్యారోపణలకు ఇది వేదికైంది. ప్రతీ అభ్యర్థి సోషల్‌మీడియా నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, శరవేగంతో పోస్టింగ్‌లు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా క్షణాల్లో పోస్టింగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వారం రోజుల్లోనే దీని వేగం మూడింతలు పెరిగిందని ఇటీవల ఓ సర్వే సంస్థ పేర్కొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మరో ఐదు రోజుల్లో ఈ స్పీడ్ నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ప్రత్యక్ష ప్రసారాలను కూడా సోషల్ మీడియా ద్వారానే ఇస్తున్నారు. -
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్‌లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్‌బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. -
సమర సైనికులు వీరే..
సాక్షి, గుంటూరు : ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభించింది. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో 17 మంది సమన్వయకర్తలకు అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. మొత్తం ఆరుగురు కొత్త అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులు, 17 మంది అసెంబ్లీ అభ్యర్థులు నూతనోత్సాహంతో సమరశంఖం పూరిస్తూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి పార్టీ సైనికులను సన్నద్ధం చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఆదివారం ఉదయం జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలో కష్టపడి పనిచేసిన వారందరికీ ముందుగా మాటిచ్చిన ప్రకారం టిక్కెట్లు కేటాయించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతను నిలుపుకొన్నారు. కష్టకాలంలో పార్టీకోసం కృషి చేసిన సమన్వయకర్తలందరికీ టిక్కెట్లు ఇచ్చి మాటతప్పని, మడమతిప్పని నాయకుడిగా నిరూపించుకున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించడంతో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి, ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో సామాన్యునికి పట్టంకట్టారు. అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పిస్తూ టిక్కెట్లు కేటాయించడంతో జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 17 అసెంబ్లీ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి మూడు సీట్లు, రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు సీట్లు, ఎస్సీలకు మూడు స్థానాలు, బీసీలకు మూడు, కాపులకు రెండు, ముస్లిం మైనార్టీ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం విశేషం. వీటిల్లో తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేటలో మహిళా అభ్యర్థులను నిలపటంతో, జిల్లా ప్రజలు మహిళలకు పెద్ద పీట వేశారని వ్యాఖ్యానిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక పార్టీ తరఫున ముగ్గురు మహిళలు పోటీ చేయడం విశేషం. రాజధాని కీలక నియోజకవర్గంలో మహిళా అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల బరిలో నిలిచారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం టిక్కెట్‌ను సిట్టింగ్ ముస్తఫాకు కేటాయించి ముస్లిం మైనార్టీల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని సైతం ఎన్నడూ లేని విధంగా కమ్మ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు కేటాయించి ఆవర్గంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించడంతో జిల్లా ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో మహిళలంతా తమకు వైఎస్సార్సీపీ ఇచ్చిన గౌరవానికి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి అన్ని స్థానాల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా ఏకమై తమకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్ సీపీ వైపే ఉంటామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బ్రాహ్మణులకు సీటు కేటాయించడంతో ఆ సామాజిక వర్గం వారు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలుస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం, పేద కుటుంబానికి సామాన్యుడు బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌తో ఎంపీ అభ్యర్థుల జాబితాను చదివించారు. ఎన్నికల బరిలో ఆరుగురు కొత్తముఖాలు సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఆరుగురు అభ్యర్థులు సమరానికి సై అంటున్నారు. బాపట్ల, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెదకూరపాడు నంబూరి శంకరరావు, గురజాల కాసు మహేష్‌రెడ్డి, చిలకలూరిపేట విడదల రజిని, తాడికొండ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మొదటి సారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నవారు కావడం గమనార్హం. సామాన్యుడికి అరుదైన అవకాశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సామాన్య కార్యకర్త నందిగం సురేష్‌కు టిక్కెట్ ఇచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి ఇది నిదర్శనం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఎంపీల జాబితాను చదివే అరుదైన అవకాశం నందిగం సురేష్‌కు దక్కింది. సామాన్య కార్యకర్తనైన తనకు అరుదైన అవకాశం వచ్చిందని, ఈ జన్మకు ఈ అదృష్టం చాలని సురేష్ సంతోషం వ్యక్తంచేశారు. సమైక్య ఉద్యమ పోరాట యోధుడు గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి సమైక్య ఉద్యమం సమయంలో రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు పార్లమెంటులో గట్టిగా పోరాడారు. ఉత్తరదాది ఎంపీలతో దెబ్బలు తిన్నారు. గతంలో నరసరావుపేట ఎంపీగా పనిచేశారు. తరువాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన మోదుగుల వేణుగోపాలెడ్డి టీడీపీలో అవినీతి, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. మాస్‌లీడర్‌గా మోదుగులకు గుర్తింపు ఉంది. బరిలో విద్యాధికుడు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా యువకుడు, విద్యావేత్త, విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలును ఎంపిక చేశారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తారని, పల్నాడు ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తాడనే నమ్మకంతో ఆయనకు ఈ బాధ్యత అప్పజెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా పనిచేశారు. తరువాత రాజకీయ సమీకరణలో భాగంగా నరసరావుపేట పార్లమెంటు సమన్వకర్తగా నియమితులయ్యారు. కష్టపడి పనిచేయడంతో పాటు, అనతికాలంలోనే పల్నాడు ప్రజల అభిమానాన్ని చూగొన్నారు. -
చైతన్యానికి చిరునామా ‘చిట్యాల’
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : చైతన్యానికి చిరునామా చిట్యాల మండలం. ఈ మండలంలో నాటి సాయుధ తెలంగాణ పోరాటంతో పాటు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చరిత్ర చిట్యాల మండల ప్రజలది. అంతేకాదు ఈ మండలం రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరుగా ఉంటూ వస్తోంది. చిట్యాల మండలానికి చెందిన ఎందరో నాయకులు చట్ట సభలకు ప్రాతి నిధ్యం వహించారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో చిట్యాల మండలానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నకిరేకల్ శాసనసభ(ఎస్సీ రిజర్వుడు)కు పదిహేను మంది అభ్యర్థులు రంగంలో ఉండగా అందులో చిట్యాల మండలానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మరొకరు నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా చిట్యాలలో నివాసం ఉంటూ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి వరకు చదువుకున్న పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అభ్యర్థి పార్టీ గ్రామం నియోజకవర్గం కాసర్ల లింగయ్య బీజేపీ గుండ్రాంపల్లి నకిరేకల్ మేడి సత్యనారాయణ తెలంగాణ ప్రజాపార్టీ పిట్టంపల్లి నకిరేకల్ జిట్ట నగేష్ సీపీఎం చిట్యాల నకిరేకల్ నూనె వెంకటస్వామి బీఎస్పీ చిట్యాల నకిరేకల్ మేడి నరేష్ సమాజ్‌వాదిపార్టీ వనిపాకల నకిరేకల్ గాదె శ్రీను బహుజన ముక్తి పార్టీ శివనేనిగూడెం కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ ఉరుమడ్ల నల్లగొండ -
ఎంపీకి ఇటు.. అసెంబ్లీకి అటు!
* తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్‌కు అవకాశం * మిత్రపక్షాల వాళ్లు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న భయం * పొత్తులు, స్థానిక పరిస్థితులతో అధిక ప్రభావం * ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఉద్యమ నేపథ్యం, స్థానిక పరిస్థితులు, బలహీన అభ్యర్థులు బరిలో ఉండడం, పొత్తులతో బరిలో ఉన్న మిత్రపక్షాల అభ్యర్థులు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న సందేహం... ఇలాంటివన్నీ క్రాస్ ఓటింగ్ ఆందోళనను మరింత రేకెత్తిస్తున్నాయి. దీనికితోడు పలు చోట్ల స్వయంగా పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. దీంతో పాటు ఎంపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట.. ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట ఎంపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తుండడం.. అందులోనూ సొంత పార్టీలు, పార్టీ నేతలే ఈ పని చేస్తుండడం గమనార్హం. దీంతో క్రాస్ ఓటింగ్ భారీగా ఉండవచ్చని అంచనా. దీని వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే విషయమై పార్టీలు ఒక స్పష్టతకు రాలేకపోతున్నాయి. అన్ని పార్టీలకూ సెగ: టీఆర్ఎస్ తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మిత్రపక్షం బీజేపీకి టీడీపీ అధిక స్థానాలను వదిలి పెట్టింది. దీంతో పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మిత్రపక్ష అభ్యర్థి గెలిస్తే పాతుకుపోతాడేమోనన్న భయంతో సదరు అభ్యర్థికి ఓటేయొద్దంటూ శ్రేణులను ఆదేశిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీలో లేని ప్రాంతాల్లో ఆ పార్టీ క్యాడర్ పక్క పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి చోట్ల్ల ఈ క్యాడర్ ప్రభావంతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితి ఉంది. బీజేపీ పోటీలో లేని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. పార్టీలు, అభ్యర్థులు కూడా: కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌కు కారణమవుతున్నారు. ఏదైనా పార్లమెంట్ స్థానంలో పార్టీ అభ్యర్థి బలంగా లేకపోతే.. దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు తమ గెలుపు కోసం కష్టపడాల్సి వస్తున్నది. అలాంటి ప్రాంతాల్లో ‘అసెంబ్లీకి మాకు ఓటు వేయండి.. పార్లమెంట్‌కు మీ ఇష్టం’ అనే విధంగా ప్రచారం చేశారు. ఇక పార్లమెంట్ స్థానంలో గట్టి అభ్యర్థి ఉండి.. అసెంబ్లీ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నచోట మరోలా క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు. ఉదాహరణకు నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని తీసుకుంటే.. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలకు ఒక పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి, పార్లమెంట్‌కు వచ్చేసరికి మరో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన అభ్యర్థి వైపు ఆ వర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కానీ, అసెంబ్లీ విషయానికి వచ్చే సరికి ఆయా పార్టీ అభ్యర్థులను బట్టి ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోనూ ‘ఎమ్మెల్యేకు ఎవరికైనా వేయండి.. ఎంపీగా మాత్రం నాకు ఓటేయండి..’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మల్కాజిగిరిలో మరీ ఎక్కువ: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి, ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పైగా ఎంపీకి ఓటు వే యాలని అడిగితే.. తమకు కూడా ఓటేసే పరిస్థితి లేదని అంచనా వేసిన సదరు అసెంబ్లీ అభ్యర్థులు ‘ఎంపీకి మీ ఇష్టం.. అసెంబ్లీకి మాత్రం మాకే ఓటేయండి..’ అంటూ ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే ఇక్కడ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నా.. ఆ పార్టీయే పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు కూడా సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. -
ఫ్యాన్ గాలి వీస్తోంది
- ప్రచారంలో వైఎస్ఆర్ సీపీ ముందంజ - రాజన్న పథకాలను వివరిస్తూ - మేనిఫెస్టోపై అవగాహన కల్పిస్తూ - ముందుకు సాగుతున్న అభ్యర్థులు - ప్రజల నుంచి అనూహ్య స్పందన నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు పల్లెలు, పట్టణాలలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడపగడప కూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందినవారు అభ్యర్థులను అక్కున చేర్చుకుంటున్నారు. రాజన్న పథకాలను వివరిస్తూ, తమను గెలిపిస్తే తిరిగి సువర్ణ పాలన అందిస్తామని అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఎనిమిది అ సెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థు ల ప్రచారం ఊపుమీద ఉంది. లోక్‌సభ అభ్యర్థులు నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు సంగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మహమూద్ మొహియొద్దీన్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ఇటీవల బోధన్‌లోని కాజాపురంలో ప్రచారం నిర్వహించారు. బీడీ కార్మికులు, గృహిణులు ప్రచారంలో పాల్గొని ఆయనకు మద్దతు పలికారు. బాల్కొండ, నిజామాబాద్, ఆర్మూర్ నియోజక వర్గా ల్లో రవీందర్‌రెడ్డి 15 రోజులుగా విరామం లేకుండా ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకు హామీ ఇస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మొహియొద్దీన్ కామారెడ్డి,ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వృద్ధులు, యువతులు, గృహిణులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, నీటి కొరత నివారణ , వైద్యసదుపాయాలపై తాము చేసే కృషిని వివరిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నిజామాబాద్ అర్బన్‌లో అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. నగరంలోని 36, 37, 17, 25 డివిజన్లలో మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున శ్రీధ ర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, మైనారిటీలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ శ్రీధర్‌రెడ్డి ప్రచారంలో ముందుం టున్నారు. ప్రతి రోజు డివిజన్లలో తిరుగుతున్నారు. నగరంలో ప్రధాన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తున్నారు. ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సిద్ధార్థరెడ్డి వేగంగా ప్రచారంలో ముందున్నారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి పొలాలలో పనిచేసే కూలీల వద్దకు వెళ్లి కలువగా వారు సానుకూలంగా స్పందించి మద్దతు ప్రకటించారు. మార్కెట్లోని వ్యాపారులను కలుస్తూ వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామం లో పర్యటిస్తూ వైఎస్ఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అలాంటి పాలన మళ్లీ రావాలంటే వైఎస్సార్సీపీనే గెలిపించాలని కోరుతున్నారు. జుక్కల్‌లో జుక్కల్ నియోజకవర్గంలో నాయుడు ప్రకాశ్ వ్యాపారులను కలిసి వారి మద్దతు కోరారు. హోటళ్లలోని కార్మికులతో కలిసి వారిలో పనిలో మమేకమయ్యారు. మద్నూరు, జుక్కల్ , బిచ్కుందలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన యువకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. నియోజకవర్గంలోని మిగతా పార్టీల అభ్యర్థుల కంటే నాయుడు ప్రకాశ్ ప్రచారంలో ముందున్నారు. బోధన్‌లో బోధన్ నియోజక వర్గంలో సుదీప్‌రెడ్డి ప్రచారం జోరుగా చేస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డితో కలిసి ఆయా గ్రామాల్లో, మండలాల కేంద్రాలలో ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీని గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుని కార్మికులకు, రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బాన్సువాడలో బాన్సువాడ నియోజకవర్గంలో శోభన మహేందర్‌రెడ్డి విస్తృతం గా ప్రచారం చేస్తున్నారు. గ్రామాలలో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని ఓటర్లను కోరుతున్నారు. తమ పార్టీ మాత్రమే మహిళకు అవకాశం ఇచ్చిందని, తనను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డిలో కామారెడ్డిలోని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజ లకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. గ్రా మ గ్రామాన తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. నిజామాబాద్ రూరల్‌లో నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో బొడ్డు గంగారెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ ఆర్సీపీకి ఓటువేయాలని కోరుతున్నారు. బాల్కొండలో బాల్కొండ నియోజక వర్గంలో పాలెపు మురళి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వే యాలని కోరుతున్నారు. ఓటర్ల నుంచి స్పందన రావడంతో ఆయన మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. -
సంఖ్య తేలింది... ఇక సమరమే
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్య తేలిపోయింది. నామినేషన్ ఉపసంహరణకు ఇచ్చిన రెండు రోజుల (మంగళ,బుధ వారాలు) గడువులో మొత్తం 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 77 మంది, ఒక లోక్‌సభ స్థానానికి తొమ్మిది మంది కలిపి మొత్తం 86 మంది బరిలో నిలిచారు. ఈ నెల 12 నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు అసెంబ్లీ స్థానాలకు 114 నామినేషన్లు దాఖలు చేశారు. 21న నామినేషన్ల పరిశీలన చేపట్టగా 20 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా 22, 23 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సందర్భంగా 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 9 అసెంబ్లీ స్థానాల్లో 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు లెక్క తేలింది. జిల్లాలోని ఒక్క పార్లమెంటు స్థానానికి 11 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలనానంతరం పది నామినేషన్లు అర్హత పొందాయి. ఒక నామినేషన్ ఉపసంహరించుకోగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి కాంతిలాల్ దండే తెలిపారు. ఉపసంహ రించుకున్న వారి సంఖ్య.. కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ఇద్దరు, చీపురుపల్లి నుంచి నలుగురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ఒకరు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్ కోట నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్ కోట నుంచి ఐదుగురు ఉపసంహరించుకోగా బొబ్బిలి నుంచి నామినేషన్ల ఉపసంహరణ చేసిన వారెవరూ లేకపోవడం విశేషం. అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థులు కురుపాం అసెంబ్లీ స్థానం: పార్టీ పాముల పుష్ప శ్రీవాణి (వైఎస్సార్ సీపీ )కోలక లక్ష్మణమూరి ్త(సీపీఎం), జనార్దన్ థాట్రాజ్ (టీడీపీ) ఎర్రమిల్లి ఇంద్రసేనవర్ధన్ (కాంగ్రెస్ ), నిమ్మక జయరాజ్(టీడీపీ రెబల్), స్వతంత్ర అభ్యర్థులు ఆరిక రసూల్, పాలక రంజిత్ కుమార్, కడ్రక వెంకటస్వామి. పార్వతీపురం: జమ్మాన ప్రసన్నకుమార్( వైఎస్సార్ సీపీ ),అలజంగి జోగారావు(కాంగ్రెస్),బొబ్బిలి చిరంజీవులు(టీడీపీ),యమ్మల మన్మధరావు(సీపీఎం),గొంగాడ లక్ష్మణరావు(జేఎస్పీ), ఇతరులు మర్రి తవిటయ్య, వెలగాడ కృష్ణ , గర్భాపు పుష్పనాథం సాలూరుః పీడీక రాజన్నదొర( వైఎస్సార్ సీపీ ),సీదరపు అప్పారావు(సీపీఎం),ఆండ్రబాబా(కాంగ్రెస్ ), ఆర్పి భంజ్‌దేవ్(టీడీపీ )జన్ని రాము (సీపీఐ), ఊయక ముత్యాలు (ఇండిపెండెంట్ ). బొబ్బిలి: ఆర్వీఎస్కే రంగారావు( వైఎస్సార్ సీపీ ), వెంగళ నారాయణ రావు( బీఎస్పీ) ఎస్వీసీహెచ్ అప్పలనాయుడు( కాంగ్రెస్),తెంటు లక్ష్మునాయుడు (టీడీపీ), వాసిరెడ్డి అనూరాధ (జేఎస్పీ), ఎస్ జాన్ విల్సన్ (ఇండిపెండెంట్ ). చీపురుపల్లి ః బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ ), కిమిడి మృణాళిని (టీడీపీ ),బొత్స సత్యనారాయణ(కాంగ్రెస్), ఎస్.అనంత రాజు (పీపీఐ ),తాడ్డి శ్రీనివాసరావు (జేఎస్పీ), బులుసు నాగ శ్రీనివాస్(ఆమ్ ఆద్మీ ), రెడ్డి లక్ష్మునాయుడు(లోక్ సత్తా), గంటాన అప్పారావు(ఇండిపెండెంట్), కెంబూరి రామ్మోహనరావు(ఇండిపెండెంట్ ), పీరుబండి ప్రకాశరావు(ఇండిపెండెంట్), పెద్ది వెంకటేష్ (ఇండిపెండెంట్ ) గజపతినగరం : కడుబండి శ్రీనివాసరావు( వైఎస్సార్ సీపీ), బొత్స అప్పలనర్సయ్య (కాంగ్రెస్) ,కొండపల్లి అప్పలనాయుడు (టీడీపీ), ఆయిక జ్ఞానేశ్వరరావు(పీపీఐ),దేవర ఈశ్వరరావు (లోక్‌సత్తా), మిడతాన రవికుమార్(ఆమ్ ఆద్మీ), లగుడు గోవింద(జేఎస్పీ), సున్నపు రామస్వామి(ఇండిపెండెంట్). నెల్లిమర్లః పివివి సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) (వైఎస్సార్ సీపీ), బడ్డుకొండ అప్పలనాయుడు(కాంగ్రెస్), ఆర్జి శివప్రసాద్(బీఎస్పీ), పతివాడ నారాయణ స్వామినాయుడు(టీడీపీ), తాళ్లపూడి సత్యనారాయణ (జేఎస్పీ), మూల భూషణ అప్పారావు(ఆమ్ఆద్మీ ), ఎస్. లలితకుమారి (పీపీఐ), బగ్గ అప్పారావు(ఇండిపెండెంట్), కె.తాతినాయుడు(ఇండిపెం డెంట్), ఇజ్జురోతు రామునాయుడు(ఇండిపెండెంట్) విజయనగరం : కోలగట్ల వీరభద్రస్వామి (వైఎస్సార్ సీపీ ), మీసాల గీత (టీడీపీ), గండ్రేటి సత్యనారాయణ(బీఎస్పీ), యడ్ల రమణమూర్తి (కాంగ్రెస్) ,చనమల్ల ప్రసాదరావు(జేఎస్పీ), పాండ్రంకి వెంకటరమణ( లోక్‌సత్తా), వేగేశ్న విజయరామరాజు(పీపీఐ), వి.శివానంద( నవభారత్ ), శీర రమేష్ కుమార్ (ఆమ్ ఆద్మీ), రెడ్డి త్రినాథరావు (ఇండిపెండెంట్ ), సారిపల్లి శ్రీనివాసరావు( ఇండిపెండెంట్). ఎస్.కోటః రొంగలి జగన్నాథం( వైఎస్సార్ సీపీ ), కోళ్ల లలిత కుమారి (టీడీపీ), ఇందుకూరి రఘురాజు (కాంగ్రెస్), జి.ముత్యాలరావు (బీఎస్పీ), గండ్రేటి అప్పారావు(పీపీఐ), దరిమిరెడ్డి వెంకటరావు( జేఎస్పీ), పూసపాటి కెవీఎస్ఎస్పీ వర్మ(ఆమ్ ఆద్మీ) , స్వతంత్ర అభ్యర్థులు కాండ్రేగుల నరసింగరావు, గొంప నాగభూషణం. నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య.. కురుపాం- ఎనిమిది మంది, పార్వతీపురం-ఎనిమిది మంది, సాలూరు- ఆరుగురు, బొబ్బిలి-ఆరుగురు, చీపురుపల్లి-11 మంది, గజపతినగరం-ఎనిమిది మంది, నెల్లిమర్ల- పది మంది, విజయనగరం-11 మంది, ఎస్.కోట- 9 మంది ఉన్నారు. -
పొత్తు.. ఎత్తు
* కత్తులు దూసుకుంటున్న కమలం-పసుపు * ఎంపీ ఓటు నాకు... ఎమ్మెల్యే మీ ఇష్టం * అన్ని పార్టీల అసెంబ్లీ అభ్యర్థులతో ఎంపీ అభ్యర్థుల ఒప్పందాలు * భారీగా నమోదు కానున్న క్రాస్ ఓటింగ్ * పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో విచిత్ర పరిస్థితి గోదావరి ఖని నుంచి: ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి బి. నారాయణరెడ్డి: పొత్తు బెడిసికొట్టనుందా ? వికసిస్తుందనుకున్న పొత్తు వికటించనుందా ? అదే పొత్తు ఓటమికి దారి తీస్తుందా ? బీజేపీ-టీడీపీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు పట్ల అభ్యర్థుల భయాలు ఇవి. ఈ రెండు పార్టీ మధ్య నెలకొన్న గ్యాప్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇతర పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు ఎవరికైనా వేసుకోండి....ఎంపీకి మాత్రం మాకే వేయండి అనే ఒప్పందానికి వస్తున్నారు. దాంతో కరీంనగర్ జిల్లాలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. పైగా...ఒక పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి బలంగా ఉంటే...ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. తాము గెలిస్తే సరి.. మా పార్టీ అభ్యర్థులు ఏమైనా ఫర్వాలేదని వారు భావిస్తున్నా రు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతున్నది. రామగుండం బెస్ట్ ఎగ్జాంపుల్...! పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుడం అసెంబ్లీ సెగ్మెంట్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆటో డ్రైవర్, ఇడ్లీ బండి నడిపే వారి నుంచి గత ఎన్నికల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారందరూ రంగంలో ఉన్నారు. విచిత్రంగా ప్రధాన పోటీ స్వతంత్రుల మధ్యనే నెలకొంది. కౌశిక్ హరి (కాంగ్రెస్ రెబల్), కోరుకంటి చందర్ (టీఆర్ఎస్ రెబల్) మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), బాబర్ సలీంపాషా (కాంగ్రెస్), గుజ్జుల రామక్రిష్ణారెడ్డి (బీజేపీ) వారితో పోటీ పడలేకపోతున్నారు. స్వతంత్రులు సమానంగా ఓట్లు చీల్చుకుంటే....ప్రధాన పార్టీ అభ్యర్థికి ఊహించని మేలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితిని అంచనా వేసి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థి స్వతంత్రులతో ఒప్పందానికి వస్తున్నారు. ఎమ్మెల్యే ఓట్లు మీరేయించుకోండి...ఎంపీ ఓట్లు మాత్రం నాకేయించండి. అందుగ్గాను మీకు సహాయం చేస్తాననే హామీ ఇచ్చినట్టు సమాచారం. దాంతో ఎమ్మెల్యే ఎవరు గెలిచినా ఎంపీకి ఓట్లు తనకే పడతాయనే నమ్మకంలో ఉన్నారు. ఇద్దరినీ దెబ్బతీసిన పొత్తు..! బీజేపీ-టీడీపి పొత్తు బెడిసికొట్టినట్టే. ఓట్ల పంపకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది. వారికి టీడీపీ నుంచి అనుకున్న సహాకారం అందడం లేదనే విమర్శ ఉంది. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా బీజేపీ నుంచి అదే సమస్య ఎదురవుతున్నది. పైగా ఈ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు రంగంలో ఉన్నారు. దాంతో ఈ అవకాశాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. నియోజకవర్గాన్ని బట్టి ఎంపీకి ఒక పార్టీకి, ఎమ్మెల్యే స్థానానికి మరో పార్టీకి ఓట్లు వేసే పరిసి ్థతి ఉంది. అన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు. విచిత్రంగా మారిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు...! కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీలకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. టీడీపి క్యాడర్ ద్వారా వచ్చే ఓట్ల కోసం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి ఒక పార్టీ ఎంపీ అభ్యర్థి మరో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. - సిరిసిల్లాలో టీడీపీ వారు బీజేపీకి పనిచేయడం కష్టం...దాంతో టీఆర్ఎస్కి లాభంగా మారింది. - జగిత్యాలలో బీజేపీ వారు టీడీపి అభ్యర్థి ఎల్ రమణకు ఎంత వరకు మద్దతు ఇస్తారనేది అనుమానంగా ఉంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రయోజనకరంగా ఉంది. - పెద్దపల్లిలో ఇరుపార్టీల మధ్య సమన్వయం లేదు. - ధర్మపురిలో కూడా అంతే బీజేపీ అభ్యర్థికి టీడీపి నుంచి అనుకున్న స్పందన లేదు. -
ప్రచార హోరు
సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఓటర్లపై వల విసిరేందుకు రకరకాల ఎత్తుగడలను అవలంభిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను చుట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా కుటుంబ సభ్యులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పగటివేళ గ్రామాల్లో ఓటర్లను కలుసుకుంటూ రాత్రి వేళల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించడంతోపాటు చోటా మోటా నాయకులను తమవైపు తిప్పుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఎన్నికలు తమ భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైనవిగా కావడంతో చావో రేవో అనే రీతిలో పోరాడుతున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ప్రతి చిన్న అవకాశాన్నితమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాల పెద్దలు, గ్రామ స్థాయి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ప్రణాళికతో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ జిల్లాలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం ప్రణాళిక ప్రకారం సాగుతోంది. లోక్‌సభ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను చుట్టి ఓటర్లతో మమేకమై అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. కీలక తరుణంలో మళ్లీ ఓటర్లకు చేరువయ్యేలా అన్ని నియోజకవర్గాల్లో తిరిగేలా కసరత్తు చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా బద్వేలు, కడప, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్థానిక అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకుని పంచాయతీ కేంద్రాలలో సభలు, పట్టణాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి సైతం వ్యూహాత్మకంగా జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో విసృ్తతంగా పర్యటించేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఇంటిపోరుతో టీడీపీ సతమతం నామినేషన్ల ప్రక్రియ ముగిసినా టీడీపీ ప్రచారంలో ముందుకు సాగలేకపోతోంది. వలస నేతలకు టిక్కెట్లను కట్టబెట్టడంతో పార్టీ కేడర్ నాయకత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. పులివెందులలో సైతం ఉన్న అత్తెసరు నేతల్లో విభేదాలు పొడచూపడంతో అక్కడ పోటీ నామమాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారంమాట దేవుడెరుగు..నాయకుల అసంతృప్తులు, అలకలు, బుజ్జగింపులతోనే విసిగి వేసారుతున్నారు. రాజంపేట లోక్‌సభ టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించడంతో అక్కడి శ్రేణులు పార్టీ నాయకత్వంపై రగిలిపోతున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థికి సహకరించే పరిస్థితులు కనిపించడంలేదు. అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించింది. అయితే చివరి క్షణంలో పొత్తు ధర్మాన్ని విస్మరించి చంద్రబాబు మరొకసారి వెన్నుపోటుకు తెరతీశారు. టీడీపీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌రావుకు బి.ఫారంను అందజేసి పోటీలో నిలిపారు. దీంతో బీజేపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీపై రగిలిపోతునాయి. జిల్లాలో టీడీపీకి సహకరించేది లేదని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కనుమరుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలోకి వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు బరిలో ముక్కు ముఖం తెలీని కొత్త అభ్యర్థులను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీమంత్రి అహ్మదుల్లా, డీఎల్ రవీంద్రారెడ్డి ‘చేయి’ ఇచ్చారు. చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకోవడంతో ఆఘమేఘాల మీద కొత్త నేతలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
ఓటర్లకు నాయకుల 'నగదు బదిలీ'
ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి అభ్యర్థులు దొంగదారులు వెతుక్కుంటున్నారు. ఏ మార్గంలో డబ్బు తరలించినా ఎన్నికల అధికారులు పట్టేసుకుంటున్నారు. రహస్యంగా పంపుదామనుకుంటున్నా ప్రత్యర్థి పార్టీలకు విషయం తెలిసిపోయి ఉప్పందించడంతో పోలీసులు, అధికారులు, మీడియా వచ్చి పట్టుకుంటున్నారు. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. పోటీ చేసే అభ్యర్థులు దీనికి కూడా పరిష్కారాలు కనుగొంటున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టి.. తర్వాత ఉపసంహరించుకున్న 'ప్రత్యక్ష ప్రయోజన బదిలీ'.. అదే నగదు బదిలీ పథకాన్ని ఇందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు!! చాలామంది ఓటర్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం పుణ్యమాని దాదాపు అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాటు.. ఆ వివరాలను గ్యాస్ డీలర్లకు ఇచ్చారు. దాంతో గ్యాస్ డీలర్ల వద్ద వాళ్ల పరిధిలో ఉన్న వినియోగదారులందరి బ్యాంకు ఖాతాల వివరాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్లి, వారివద్ద నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ అనుచరుల్లో కొంతమందిని ఇందుకోసం పురమాయిస్తున్నారు. ఒక్కొక్కరికి లక్ష, రెండు లక్షల వంతున వారి ఖాతాల్లో డిపాజిట్ చేసి.. ఆయా ఖాతాల నుంచి ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేయిస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓటర్లకు కూడా బ్యాంకు ఖాతాలు ఉండటంతో వీరి పని మరింత సులభం అవుతోంది. డీలర్ల నుంచి కాకుండా నేరుగా ఆయా వాడల్లోని పెద్దల వద్దకు వెళ్లి వారినుంచే వివరాలు తీసుకుని తాము ఇవ్వదలచుకున్న మొత్తం అలా బదిలీ చేసేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం కాస్తా నాయకులకు ఇలా పంట పండిస్తోంది!! -
ఆమ్ఆద్మీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
విజయనగరం లీగల్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా అసెంబ్లీ స్థానాల కు పోటీ చేస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థుల జాబితా శనివారం విడుదలైంది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు ఎ.రవికుమార్, ఎం.వి.ఎ.రావు ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం అసెంబ్లీకి శీర రమేష్‌కుమార్, నెల్లిమర్లకు మూలభూషణ్ అప్పారావు, గజపతినగరం నుంచి మిడతాన రవికుమార్, చీపురుపల్లి నుంచి బులుసు నాగశ్రీనివాస్, పార్వతీపురానికి గర్భాపు పుష్పనాథం, ఎస్.కోట నుంచి పూసపాటి ప్రతాప్ వర్మ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆ పార్టీ రాష్ర్ట కన్వీనర్ రామకృష్ణరాజు చేతుల మీదుగా వీరికి బి ఫారాలు అందజేసినట్లు పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌పై సీనియర్ల ఫైర్
గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వడంపై నిరసనలు కాంగ్రెస్‌కు మూకుమ్మడి రాజీనామాలు చేసిన ఎస్సీ నేతలు అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా... పార్టీనే నమ్ముకున్నాం. కష్టాకాలంలో తోడుగా ఉన్నాం. అలాంటి మమ్మల్ని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కనీసం పరిగణనలోకి తీసుకోలేదని అమలాపురంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎస్సీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం కాంగ్రెస్ టికెట్‌ను స్థానికేతరుడైన జంగా గౌతమ్‌కు ఇవ్వడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి నిరసనగా వారంతా సోమవారం కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఫ్యాక్సు ద్వారా పంపించారు. స్థానిక శ్రీదేవి రెసిడెన్సీలో సమావేశమైన కాంగ్రెస్ ఎస్సీ నాయకులు గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల సమయంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయంలో తానేమి చేయలేనని ఆయన చేతులెత్తేశారు. ఎమ్మెల్యే కన్నబాబుతో కూడా మాట్లాడారు. కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కన్నబాబు సూచించినా ఎస్సీ నాయకులు వినకుండా రాజీనామాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ గెడ్డం సురేష్‌బాబు, ఉప్పలగుప్తం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసుకపట్ల రఘుబాబు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ఈతకోట బాలాస్వామి, జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు ములపర్తి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ యార్లగడ్డ రవీంద్ర, ఐఎన్టీయూసీ జిల్లా మహిళా కన్వీనర్ కుంచే స్వర్ణలత, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పెయ్యల సంధ్య తదితరులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా స్థానిక పార్టీ నాయకులుగా అమలాపురం కాంగ్రెస్ టికెట్టు ఆశించినవారే. వీరితో పాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ ఎస్సీ నాయకులు కూడా రాజీనామాలు చేశారు. చిరంజీవి పట్టుపడితే టిక్కెట్ ఇచ్చేస్తారా కేంద్రమంత్రి చిరంజీవికి సన్నిహితుడైన జంగా గౌతమ్‌కు అమలాపురం నియోజకవర్గంతో ఏమాత్రం పరిచయం, సంబంధం లేదని ఆయనకు టిక్కెట్ ఇవ్వటం దారుణమని నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్పీ నేతలు అన్నారు. రెండు దశాబ్ధాలకు పైగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తమను ఇప్పుడు కరివేపాకులా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చే ముందు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత బాధిస్తోందని అన్నారు. చిరంజీవికి గౌతమ్‌పై అంత ప్రేమ ఉంటే వేరే నియోజకవర్గంలో టిక్కెట్ ఇవ్వాలే తప్ప పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను విస్మరించడం సరికాదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కార్యాచరణను రూపొందించి గౌతమ్‌ను ఓడించి పార్టీ పెద్దలకు బుద్ధి చెబుతామని ఇసుకపట్ల రఘుబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే గౌతమ్‌కు ఇచ్చిన టెక్కెట్‌ను ఉపసంహరించుకుని స్థానికులైన పార్టీ ఎస్సీ నాయకుల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
అదిగో జాబితా..ఇదిగో వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు శనివారం మీడియా ముందుకొచ్చిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చివరకు ఎంపీ అభ్యర్థుల ప్రకటనకే పరిమితమయ్యారు. ఇక శాసనసభ అభ్యర్థుల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ ఆమోదం మేరకు 110 మం ది అభ్యర్థులతో జాబితాను ఖరారు చేశామని పేర్కొన్న సూర్జేవాలా.. అందులో 29 మంది బీసీలకు, 18 మంది ఎస్సీలకు, 9 వుంది ఎస్టీలకు, 47 మ ది ఇతరులకు చోటు కల్పించినట్లు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యు-జనగాం, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-హుజూర్నగర్, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ -ఆందోల్, మల్లు భట్టివిక్రమార్క-మధిర నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. వీరితోపాటు తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతం, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఉస్మానియూ జేఏసీ నేతలు దరువు ఎల్లన్న, క్రిశాంక్‌లకు కూడా టికెట్లు ఖరారయ్యూయని సూర్జేవాలా వెల్లడించారు. సరిగ్గా ఆ సమయలోనే సోనియా గాంధీ రాజకీయు వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్ నుంచి ఫోన్ రావడంతో పరిస్థితి మారిపోయింది. అభ్యర్థుల జాబితా ప్రతులను ఏఐసీసీ మీడియా విభాగం ఇంచార్జి టాంవడక్కన్ నుంచి తీసుకోవాలని మీడియూ ప్రతినిధులకు తెలియజేసి సుర్జేవాలా అర్ధాంతరంగా వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తరువాత మీడియూ ప్రతినిధులంతా వడక్కన్ దగ్గరకు వెళ్లగా సాంకేతిక కారణాల వల్ల జాబితాను ప్రస్తుతానికి విడుదల చేయడం లేదని, ఆదివారం మెయిల్ చేస్తామని బదులివ్వడంతో మీడియూ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే: తెలంగాణ అభ్యర్థుల ఎంపిక విషయంలో శనివారం ఉదయుం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు హైడ్రామా చోటు చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి మధ్యాహ్నం ఢిల్లీలోని వార్‌రూంలో అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చేందుకు దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గానీ, ఇటు ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహను గానీ పిలవలేదు. ఇన్నాళ్లూ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు వారిని పిలిచినప్పటికీ వారి అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని సమాచారం. జాబితా రూపకల్పనలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు ముద్రే అధికంగా కనిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా శనివారం దిగ్విజయ్‌సింగ్ వార్‌రూమ్‌కు వెళ్లే సమయంలోనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ.. ఆయనను పిలవలేదు. రెడ్డి, దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి తప్ప.. అభ్యర్థుల ఎంపికలో వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని సమాచారం. సామాజిక సమీకరణాలు, యువకులు, మహిళలు, జేఏసీ నేతలు.. అన్నీ సమీకరణాలు చూసుకుని టిక్కెట్లు ఇవ్వాలని సోనియా, రాహుల్ సూచించిన ప్పటికీ.. ఆయా సమీకరణాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక మాత్రం కేవలం దిగ్విజయ్, పొన్నాల మాత్రమే చేసినట్టు సమాచారం. వీరి ఇష్టానుసారంగానే జాబితా రూపొందిందని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే చివరి నిమిషంలో ఈ సమాచారం అందుకు న్న అధిష్టానం జాబితాను ఆపేయాలని అహ్మద్‌పటేల్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన నేరుగా మీడియా కార్యదర్శికి ఫోన్‌చేశారు. కాగా మధ్యాహ్నం ఓవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే.. మాజీ మంత్రి డి.కె.అరుణ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని జైపాల్‌రెడ్డికి కాకుండా బీసీ అభ్యర్థికి ఇవ్వాలని, జైపాల్‌రెడ్డి తన వారినే అసెంబ్లీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభ్యర్థుల జాబితా ప్రకటనను నిలిపేయాలని అధిష్టానం ముఖ్యులు ఆదేశించినట్లు సమాచారం. జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ దృష్ట్యానే!: ఏఐసీసీ ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయుని చివరి నిమిషంలో గ్రహించడంవల్లే జాబితా ప్రకటనను నిలిపేసినట్లు ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. సవూచార లోపంవల్లే ఈ గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అరుుతే కాంగ్రెస్ నేతలు వూత్రం అభ్యర్థుల ఎంపికలో హైకవూండ్ పెద్దలతోపాటు టీపీసీసీ నేతల మధ్యనున్న విభేదాలకు శనివారంనాటి పరిణామాలు అద్దం పడుతున్నాయుని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏడుగురి పేర్లతో ఎంఐఎం అభ్యర్థుల జాబితా విడుదల
-
13న అధిష్టానానికి నివేదిక
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభకు పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఏఐసిసి ప్రతినిధులు ముగ్గురు ఈరోజు ఇక్కడకు వచ్చారు. గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. శాసనసభతోపాటు లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి ప్రతినిధులు నివేదిక రూపొందించి ఈనెల 13న అధిష్టానవర్గానికి ఇస్తారు. నివేదిక రూపొందించేందుకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.