
అదిగో జాబితా..ఇదిగో వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు శనివారం మీడియా ముందుకొచ్చిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చివరకు ఎంపీ అభ్యర్థుల ప్రకటనకే పరిమితమయ్యారు. ఇక శాసనసభ అభ్యర్థుల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ ఆమోదం మేరకు 110 మం ది అభ్యర్థులతో జాబితాను ఖరారు చేశామని పేర్కొన్న సూర్జేవాలా.. అందులో 29 మంది బీసీలకు, 18 మంది ఎస్సీలకు, 9 వుంది ఎస్టీలకు, 47 మ ది ఇతరులకు చోటు కల్పించినట్లు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యు-జనగాం, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-హుజూర్‌నగర్, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ -ఆందోల్, మల్లు భట్టివిక్రమార్క-మధిర నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు.
వీరితోపాటు తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతం, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఉస్మానియూ జేఏసీ నేతలు దరువు ఎల్లన్న, క్రిశాంక్‌లకు కూడా టికెట్లు ఖరారయ్యూయని సూర్జేవాలా వెల్లడించారు. సరిగ్గా ఆ సమయలోనే సోనియా గాంధీ రాజకీయు వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్ నుంచి ఫోన్ రావడంతో పరిస్థితి మారిపోయింది. అభ్యర్థుల జాబితా ప్రతులను ఏఐసీసీ మీడియా విభాగం ఇంచార్జి టాంవడక్కన్ నుంచి తీసుకోవాలని మీడియూ ప్రతినిధులకు తెలియజేసి సుర్జేవాలా అర్ధాంతరంగా వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తరువాత మీడియూ ప్రతినిధులంతా వడక్కన్ దగ్గరకు వెళ్లగా సాంకేతిక కారణాల వల్ల జాబితాను ప్రస్తుతానికి విడుదల చేయడం లేదని, ఆదివారం మెయిల్ చేస్తామని బదులివ్వడంతో మీడియూ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే: తెలంగాణ అభ్యర్థుల ఎంపిక విషయంలో శనివారం ఉదయుం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు హైడ్రామా చోటు చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి మధ్యాహ్నం ఢిల్లీలోని వార్‌రూంలో అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చేందుకు దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గానీ, ఇటు ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహను గానీ పిలవలేదు. ఇన్నాళ్లూ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు వారిని పిలిచినప్పటికీ వారి అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని సమాచారం.
జాబితా రూపకల్పనలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు ముద్రే అధికంగా కనిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా శనివారం దిగ్విజయ్‌సింగ్ వార్‌రూమ్‌కు వెళ్లే సమయంలోనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ.. ఆయనను పిలవలేదు. రెడ్డి, దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి తప్ప.. అభ్యర్థుల ఎంపికలో వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని సమాచారం. సామాజిక సమీకరణాలు, యువకులు, మహిళలు, జేఏసీ నేతలు.. అన్నీ సమీకరణాలు చూసుకుని టిక్కెట్లు ఇవ్వాలని సోనియా, రాహుల్ సూచించిన ప్పటికీ.. ఆయా సమీకరణాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక మాత్రం కేవలం దిగ్విజయ్, పొన్నాల మాత్రమే చేసినట్టు సమాచారం. వీరి ఇష్టానుసారంగానే జాబితా రూపొందిందని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే చివరి నిమిషంలో ఈ సమాచారం అందుకు న్న అధిష్టానం జాబితాను ఆపేయాలని అహ్మద్‌పటేల్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన నేరుగా మీడియా కార్యదర్శికి ఫోన్‌చేశారు. కాగా మధ్యాహ్నం ఓవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే.. మాజీ మంత్రి డి.కె.అరుణ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని జైపాల్‌రెడ్డికి కాకుండా బీసీ అభ్యర్థికి ఇవ్వాలని, జైపాల్‌రెడ్డి తన వారినే అసెంబ్లీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభ్యర్థుల జాబితా ప్రకటనను నిలిపేయాలని అధిష్టానం ముఖ్యులు ఆదేశించినట్లు సమాచారం.
జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ దృష్ట్యానే!: ఏఐసీసీ
ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయుని చివరి నిమిషంలో గ్రహించడంవల్లే జాబితా ప్రకటనను నిలిపేసినట్లు ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. సవూచార లోపంవల్లే ఈ గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అరుుతే కాంగ్రెస్ నేతలు వూత్రం అభ్యర్థుల ఎంపికలో హైకవూండ్ పెద్దలతోపాటు టీపీసీసీ నేతల మధ్యనున్న విభేదాలకు శనివారంనాటి పరిణామాలు అద్దం పడుతున్నాయుని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.