ఆమ్‌ఆద్మీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
Published Tue, Apr 15 2014 1:39 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
విజయనగరం లీగల్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా అసెంబ్లీ స్థానాల కు పోటీ చేస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థుల జాబితా శనివారం విడుదలైంది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు ఎ.రవికుమార్, ఎం.వి.ఎ.రావు ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం అసెంబ్లీకి శీర రమేష్‌కుమార్, నెల్లిమర్లకు మూలభూషణ్ అప్పారావు, గజపతినగరం నుంచి మిడతాన రవికుమార్, చీపురుపల్లి నుంచి బులుసు నాగశ్రీనివాస్, పార్వతీపురానికి గర్భాపు పుష్పనాథం, ఎస్.కోట నుంచి పూసపాటి ప్రతాప్ వర్మ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆ పార్టీ రాష్ర్ట కన్వీనర్ రామకృష్ణరాజు చేతుల మీదుగా వీరికి బి ఫారాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement