సాక్షి, అమరావతి : సోషల్ మీడియా ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది. అభ్యర్థుల ఆరోపణ, ప్రత్యారోపణలకు ఇది వేదికైంది. ప్రతీ అభ్యర్థి సోషల్‌మీడియా నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, శరవేగంతో పోస్టింగ్‌లు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా క్షణాల్లో పోస్టింగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వారం రోజుల్లోనే దీని వేగం మూడింతలు పెరిగిందని ఇటీవల ఓ సర్వే సంస్థ పేర్కొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మరో ఐదు రోజుల్లో ఈ స్పీడ్ నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ప్రత్యక్ష ప్రసారాలను కూడా సోషల్ మీడియా ద్వారానే ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment