బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో.. | Bigg Boss 8 Telugu: Nagarjuna Shows Red Card to Abhay Naveen | Sakshi
Sakshi News home page

ఈ క్షణమే వెళ్లిపోమన్న నాగ్‌.. మోకాళ్లపై కూర్చుని వేడుకున్న అభయ్‌..

Published Sat, Sep 21 2024 4:37 PM | Last Updated on Sat, Sep 21 2024 5:49 PM

Bigg Boss 8 Telugu: Nagarjuna Shows Red Card to Abhay Naveen

మొన్నటివరకు బాగానే ఉన్న అభయ్‌ చీఫ్‌ అయ్యాక తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందరికంటే తోపు అని ఫీలయ్యాడో ఏమోకానీ ఏకంగా బిగ్‌బాస్‌నే తిట్టాడు. మెంటల్‌, దిమాక్‌ లేదు, వాళ్లింట్లో పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్‌ మారుస్తున్నట్లున్నాడు, బిగ్‌బాస్‌ కాదు బయాస్‌డ్‌ బాస్‌.. ఇలా నోటికొచ్చినవన్నీ అనేశాడు. బిగ్‌బాస్‌ కంటే గొప్ప అనుకుంటే బయటకు వెళ్లిపోండి అని నిన్న గేట్లు ఎత్తితే మళ్లీ కిక్కురుమనకుండా ఉన్నాడు. 

అభయ్‌ను వాయించిన నాగ్‌
ఇంత జరిగాక కూడా తానే తప్పూ చేయలేదని బుకాయించడం గమనార్హం. ఇలాంటివి బిగ్‌బాస్‌ చూస్తూ ఊరుకుంటాడేమో కానీ నాగార్జున అస్సలు ఊరుకోడు. తాజాగా రిలీజైన ప్రోమోలో అభయ్‌ను వాయించేశాడు. అన్నీ లఫంగి మాటలు.. ఇది బిగ్‌బాస్‌ హౌస్‌.. బిగ్‌బాస్‌ మాత్రమే ఇక్కడ రూల్‌ చేస్తాడు అని సీరియస్‌ అయ్యాడు. దీంతో తప్పు తెలుసుకున్న అభయ్‌ మోకాళ్లపై కూలబడి క్షమించమని అడిగాడు. 

ఇప్పుడే వెళ్లిపో..
బిగ్‌బాస్‌ను గౌరవించకపోతే నేను సహించనంటూ రెడ్‌ కార్డు చూపించాడు. ఈ క్షణమే బయటకు వెళ్లిపో అంటూ గేట్లు ఎత్తాడు. ఊహించని పరిణామానికి షాకైన అభయ్‌ ఒక్క ఛాన్స్‌ అని బతిమాలుకున్నాడు. అయితే ఇదంతా కేవలం వార్నింగ్‌ అని తెలుస్తోంది. రెడ్‌ కార్డ్‌ చూపించారు కానీ ఎలిమినేట్‌ చేయలేదని సమాచారం. కానీ ఇప్పుడు తప్పించుకున్నా రేపటి ఎపిసోడ్‌లో తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement