అమ్మాయిలూ చీరలోనే రండి.. లేదంటే వద్దు | Wear salwar-suit or saree in Rajasthan civil service exam | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ చీరలోనే రండి.. లేదంటే వద్దు

Published Fri, Oct 30 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

అమ్మాయిలూ చీరలోనే రండి.. లేదంటే వద్దు

అమ్మాయిలూ చీరలోనే రండి.. లేదంటే వద్దు

జైపూర్: రాజస్థాన్ సివిల్ సర్వీస్ పరీక్షలకు(ఆర్ఏఎస్) హాజరయ్యే అమ్మాయిలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలు కచ్చితంగ సల్వార్ సూట్ గానీ చీరగాని ధరించి రావాలని లేదంటే పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసింది. అబ్బాయిలకు కూడా కొన్ని షరతులు విధించింది.

హాఫ్ స్లీవ్స్ చొక్కాలు మాత్రమే ధరించాలని, చెప్పులు లేదా షాండిల్స్ను సాక్స్ లేకుండా ధరించి పరీక్షలకు రావాలని ఆదేశించింది. నిండుగా చొక్కాలు ధరించినవారిని, షూలు ధరించినవారిని పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేసింది. విభిన్న వస్త్రాలంకరణతో వచ్చి పరీక్షల్లో మోసం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్లే తాజాగా ఈ నిబంధన విధించాము తప్ప మరో ఉద్దేశం లేదని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement