వావివరుసలు మరచిన వదిన,మరిది..చివరికి జరిగిందిదే! | extra marital affair brother in law murder | Sakshi
Sakshi News home page

మరిదిపై మనసు పడిన వదిన.. మూడేళ్లుగా గుట్టుగా వ్యవహారం.. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో...

Published Thu, Jun 1 2023 10:44 AM | Last Updated on Thu, Jun 1 2023 11:08 AM

extra marital affair brother in law murder - Sakshi

రాజస్థాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. తనకన్నా 8 ఏళ్లు చిన్నవాడైన మరిదిపై వదిన మనసు పారేసుకుంది. కొన్ని రోజులుగా తనను పెళ్లిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వదినతో ఇతనికి సంబంధం ఏర్పడిన దరిమిలా ఆమె అతనిని వివాహం కోసం ఒత్తిడి చేసింది.

ఈ నేపధ్యంలో ఆమె పోరుపడలేని మరిది ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాయ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మదన్‌పురా గ్రామంలో తన అత్త కూతురి వివాహానికి హాజరయ్యింది. అయితే మే 23న ఉన్నట్టుండి ఆమె మాయమయ్యింది. అయితే మర్నాడు రోడ్డు పక్కన పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తమ దర్యాప్తులో ప్రాధమికంగా ఆమె నుంచి నగలు లాక్కొని ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వీరి దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు నైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది.

పోలీసు అధికారి కన్నయ్యాలాల్‌ మాట్లాడుతూ మే 24న మదన్‌పురా గ్రామశివారులోని పొదల్లో 28 ఏళ్ల వివాహిత మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందన్నారు. ఆమెపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారన్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మృతురాలు మే 23న రాత్రి పోనులో ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఉదయానికి కూడా ఆమె తిరిగిరాలేదన్నారు. పోను కాల​్‌ డిటైల్స్‌ ఆధారంగా పోలీసులు ఆ మహిళ మరిదిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారన్నారు. కాగా నైనా భర్త ముంబైలో ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు చదువుల కోసం ననిహాల్‌లో ఉంటున్నారు.

ఈ సమయంలో ఆమెకు మరిదితో సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా వారి సంబంధం కొనసాగుతూనే ఉంది. నైనా మరిది దీపక్‌ ఆమెన్నా 8 ఏళ్లు చిన్నవాడు. అయినా ఆమె చాలాకాలంగా తనను పెళ్లిచేసుకోవాలంటూ దీపక్‌ను అడుగుతూ వస్తోంది. ఈ విషయమై మే 23న రాత్రి వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో దీపక్‌ ఆమపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పొదల్లో పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు దీపక్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement