ఏడాదిగా వివాహేతర సంబంధం.. పిక్నిక్‌ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి.. | Woman Harassed And Poisoned By Lover In Shahdol | Sakshi
Sakshi News home page

పిక్నిక్‌ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి.. ఫుల్లుగా మద్యం తాగి..

Published Mon, Mar 21 2022 8:15 PM | Last Updated on Mon, Mar 21 2022 8:17 PM

Woman Harassed And Poisoned By Lover In Shahdol - Sakshi

భోపాల్‌: సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు నమ్మించి మహిళలను లొంగదీసుకుంటున్నారు. పిక్నిక్‌ పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు విషం తాగించి.. బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ(28)తో షాదబ్‌ ఉస్మాన్‌ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా, పిక్నిక్‌ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్‌సాగ‌ర్‌ తీసుకెళ్లాడు. అక్కడికి ఉస్మాన్‌ స్నేహితులు రాజేష్ సింగ్‌, సోనూ జార్జ్‌ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్‌గా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా పైశాచికత‍్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స‍్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement