అర్ధరాత్రి అమానుషం‌.. కొడుకును చంపేస్తామని బెదిరించి తల్లిపై.. | Woman Harassed After Her Toddler Taken Hostage At Gunpoint | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారం..

Mar 26 2022 4:32 PM | Updated on Mar 26 2022 4:46 PM

Woman Harassed After Her Toddler Taken Hostage At Gunpoint - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోయి మరీ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మానవత్వం మరచి ఆమె మూడేళ్ల కుమారుడి ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ(24)పై లైంగిక దాడి చేశారు. బాధితురాలు తన మూడేళ్ల కొడుకుతో కలిసి వెళ్తుండగా దుండగులు ఆ బాలుడికి గన్‌తో చంపేస్తామని బెదిరించి.. తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. బాధితురాలు శనివారం మోహగావ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను విక్రమ్‌, కృష్ణ శర్మగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement