Rajasthan: Husband kills wife for not serving food in Jodhpur - Sakshi
Sakshi News home page

అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు!

Published Tue, Jul 25 2023 2:56 PM | Last Updated on Tue, Jul 25 2023 3:36 PM

Husband Kills Wife For Not Serve Food Jodhpur In Rajasthan - Sakshi

జైపూర్‌: పెళ్లి... ఇది కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు. వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదాలతో ఇద్దరు వ్యక్తులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటిగా మారుతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ కొందరు దంపతుల మాత్రం వివాహం అయిన కొంత కాలానికే చిన్న చిన్న సమస్యలు వల్ల గొడవలు పడుతూ చివరకి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు.

15 ఏళ్ల బంధం ముగిసింది
మరికొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, లేదా ఆత్యహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే ప్రస్తుతం ట్రెండ్‌ ఇలానే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఇదే తరహాలో ఓ భర్త చిన్న కారణానికి 15 ఏళ్ల బంధాన్ని మరచి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు.  ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలోని మాతా కథాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. రమేష్ బెనివాల్ (35), సుమన్ బెనివాల్ (32) భార్యాభర్తలు.

ఆ ఒక్క మాట అనేసరికి
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు హాస్టల్‌లో చదువుతున్నారు. సుమన్ బేనివాల్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రమేష్ వ్యాపారవేత్త. తన వ్యాపారం నిమిత్తం తరచూ జోధ్‌పూర్‌కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి జోధ్ పూర్ వెళ్లి అర్థరాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం అతని భార్యను ఆహారం వడ్డించమని అడిగాడు. అయితే కాస్త అలసగా ఉందని.. ఆమె నిరాకరించింది.

దీంతో ఆగ్రహం అతను తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో రమేష్‌ ఇంట్లో ఉన్న రాయితో భార్య తలపై కొట్టగా.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య హత్య అనంతరం ఇంటి తలుపులు వేసి ఉన్న రమేష్ తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించాడు. రమేష్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

చదవండి   భర్త అనుమానం.. టిఫిన్‌ కోసం వచ్చిన యువకుడికి భార్య...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement