
రాంచీ: మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ, తన భర్తను హత్య చేసింది. ఇరుగు పొరుగు వారికి ఆమెపై అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను చేపట్టారు. ఈ ఘటనలో, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హత్య చేసి.. ఇంట్లోనే 5 రోజులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్‌నాథ్ సింగ్ మామిడిలోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని సుభాష్ కాలనీలోని రోడ్- 3లో కొంత కాలంగా నివస్తిస్తున్నాడు. అతని భార్య మీరాకు మానసికస్థితి సరిగా లేదు. దీంతో తరచూ వారిమధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆమె అమర్‌నాథ్‌ను హత్య చేసింది. అయితే కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో అమర్‌నాథ్ కనిపించలేదు. దీంతో ఇరుగు పొరుగు అతని ఇంటికి వెళ్లి మీరాను అడిగారు. అందుకు ఆమె వింతగా ప్రవర్తించేది.
అంతేకాకుండా ఇరుగుపొరుగువారు లోపలికి రాకుండా సింగ్ భార్య ఇంటి కంచెకు కరెంట్ కూడా పెట్టింది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దర్వాసన రావడంతో స్థానికులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ కనెక్షన్‌ను ఆఫ్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో అమర్‌నాథ్ హత్య బయటపడింది. స్థానికులు దీని గురించి పోలీసులతో పాటు పుణెలో ఉంటున్న అమర్‌నాథ్ కుమారుడికి తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment