
తిరువొత్తియూరు: వలసరవాక్కం ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్మికుడి మృతి కేసు మరో మలుపు తిరిగింది. విచారణలో లైంగిక వాంఛ తీర్చమని వేధించిన భర్తను భార్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వలసరవాక్కం సమీపం కైగాంకుప్పం వీసీ వీధికి చెందిన కుమార్ (48) కూలీ కార్మికుడు. అతని భార్య విజయ ఇంటి పని చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన కుమార్ తరచూ ఇంట్లో గొడవ పడేవాడు.
గత మూడో తేదీ అనుమానాస్పద రీతిలో కుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలో మృతుడి గొంతుపై కమిలిన గాయం ఉండడంతో పోలీసులు విజయను విచారణ చేయగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
చదవండి: చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్
Comments
Please login to add a commentAdd a comment