'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్! | Prince Cecil and Naresh Agastya latest Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

Kali Teaser: 'మంచితనంతో అస్సలు పుట్టకూడదు'.. ఆసక్తిగా కలి టీజర్!

Jul 7 2024 7:49 PM | Updated on Jul 7 2024 7:50 PM

Prince Cecil and Naresh Agastya latest Movie Teaser Out Now

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కల్కి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన కలి టీజర్‌ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్‌లో టీజర్ ప్రారంభమైంది. టీజర్‌లో ట్విస్ట్‌లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement