విజయ్‌ఆంటోనికి జంటగా అంజలి | Anjali pairs up with Vijay Antony | Sakshi
Sakshi News home page

విజయ్‌ఆంటోనికి జంటగా అంజలి

Published Fri, Sep 8 2017 3:55 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

విజయ్‌ఆంటోనికి జంటగా అంజలి

విజయ్‌ఆంటోనికి జంటగా అంజలి

తమిళసినిమా: విజయ్‌ఆంటోనికి జంటగా నటించడానికి నటి అంజలి రెడీ అవుతోంది. సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని ఏక కాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కాళీ. ఇది ఇంతకు ముందు రజనీకాంత్‌ నటించిన హిట్‌ చిత్ర టైటిల్‌ అన్నది గమనార్హం. కాగా ఉదయనిధి స్టాలిన్‌ భార్య కృతిక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా ఇందులో విజయ్‌ ఆంటోనికి జంటగా నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. వారిలో సునైనా, అమృతలు ఇప్పటికే ఎంపికయ్యారు.

తాజాగా అంజలి, కన్నడ నటి శిల్పా మంజునాథ్‌లను ఎంపిక చేసినట్లు దర్శకురాలు కృతిక, ఉదయనిధిస్టాలిన్‌ తెలిపారు. ఆమె మాట్లాడుతూ కాళీ చిత్రంలో అంజిలి పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పననీ, అయితే ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. ఇక నటి శిల్పా మంజునాథ్‌ను ఎంపిక చేయడానికి కారణం ఆమె అన్‌కన్వెన్షినల్‌ లుక్‌ తనను చాలా ఆకర్షించిదన్నారు. ఓ వీడియో ఆల్బంలో ఆమెను చూసి రప్పించి ఫోటో సెషన్‌ చేసి తన చిత్రంలో పాత్రకు బాగుంటుందని ఎంపిక చేశానని తెలిపారు. చిత్రంలో నలుగురు హీరోయిన్లకు సమానంగా పాత్రలు ఉంటాయని చెప్పారు. కాళీ చిత్రం సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు, రొమాన్స్‌ సన్నివేశాలతో గరంగరంగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement